ENGLAND VS AUSTRALIA ASHES 2019 1ST TEST MATCH AT BIRMINGHAM DAY 5 HIGHLIGHTS AUSTRALIA WON MK
England vs Australia, Ashes 2019: యాషెస్ తొలి టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియా ఘన విజయం
విజయానందంలో ఆస్ట్రేలియా (Image: twitter)
England vs Australia, Ashes 2019: ఆసీస్ ముందుంచిన 398 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ విఫలమైంది. ఐదో రోజు టీ బ్రేక్ కంటే ముందు ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ 251 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
England vs Australia, Ashes 2019, 1st Test Match at Birmingham, Day 5 Highlights: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ముందుంచిన 398 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ విఫలమైంది. ఐదో రోజు టీ బ్రేక్ కంటే ముందు ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ 251 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యంత పరుగుల తేడాతో జరిగిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డుల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేయగా, ఆ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ 144 పరుగులతో సెంచరీ కొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 374 పరుగుల చేసి ఆలౌటైంది. అయితే అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం 398 పరుగులు భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ లక్ష్యఛేదనలో తడబడింది. కేవలం 146 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్ చెరో 3 వికెట్లు పడగొట్టడంతో పాటు జేమ్స్ పాటిన్సన్, పీటర్ సిడిల్ చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ చేతులెత్తేసింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.