ICC World Cup 2019 | పసికూన ఆఫ్గన్‌పై దయచూపని ఇంగ్లాండ్...25 సిక్సర్లతో దండయాత్ర...
ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వీర విహారం చేసింది. ఆఫ్గనిస్తాన్ బౌలర్లపై ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ దండయాత్ర చేశారు.
news18-telugu
Updated: June 18, 2019, 6:48 PM IST

సిక్సర్ బాదుతున్న రూట్..
- News18 Telugu
- Last Updated: June 18, 2019, 6:48 PM IST
England vs Afghanistan Live Score, ICC World Cup 2019 at Old Trafford: ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వీర విహారం చేసింది. ఆఫ్గనిస్తాన్ బౌలర్లపై ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ దండయాత్ర చేశారు. నిర్ణీత 50 ఓవర్లకు ఇంగ్లాండ్ 397/6 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లో ఇయాన్ మోర్గాన్ కేవలం 71 బంతుల్లో 148 పరుగులు చేశాడు. మోర్గాన్ సాధించిన స్కోరులో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. దీంతో మోర్గాన్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా సరికొత్త రికార్డు స్థాపించాడు. మోర్గన్ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ, ఏబీ డివిలీర్స్, క్రిస్ గేల్ 16 సిక్సర్లు బాది రెండో స్థానంలో సంయుక్తంగా ఉన్నారు. కాగా మొత్తం ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఏకంగా 25 సిక్సర్లు బాదారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ ఓపెనర్లు బెయిర్‌స్టో(90), జేమ్స్(26) శుభారంభం ఇవ్వగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మోర్గన్ సిక్సర్లతో ఆఫ్గన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మోర్గన్ బాదిన సిక్సర్లతో స్టేడియం మోత మోగింది. 35 ఓవర్ల వద్ద ఇంగ్లాండ్ స్కోరు 200 పరుగులు దాటగా, 45 ఓవర్ కు ఏకంగా 325 పరుగులకు చేరుకుంది. అంటే పది ఓవర్లలో దాదాపు 125 పరుగులు నమోదయ్యాయి. మోర్గాన్ కు తోడుగా రూట్ కూడా బ్యాట్ ఝళిపించడంతో ఆఫ్గన్ బౌలర్లు నిశ్చేష్టులయ్యారు. రషీద్ ఖాన్ తన స్పెల్ లో ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మహ్మద్ నబీ కూడా 70 పరుగులు ఇచ్చాడు.
6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ #EoinMorgan hit 102 runs JUST in sixes!#CWC19 | #CWC19 pic.twitter.com/E3iLLTNs1h
— Cricket World Cup (@cricketworldcup) June 18, 2019
India vs Bangladesh: రోహిత్ శర్మ ఔట్...నిలకడగా ఆడుతున్న భారత్
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్... సూపర్ ఓవర్ రూల్స్ మార్చిన ఐసీసీ
రోహిత్ శర్మ లేని ఫోటో పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ.. ఆడేసుకున్న నెటిజన్లు..
విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ వివాదం.. రంగంలోకి దిగిన బీసీసీఐ..
అలా రాటుతేలాను... వరల్డ్ కప్ పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ వేదాంతం
ఐసీసీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్...నెం.1 బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ...