ICC World Cup 2019 | సిక్సర్లతో మోత మోగించిన మోర్గాన్...ఆఫ్గన్ బౌలర్లకు ఫ్రీగా ఎయిర్ షో...

ఆఫ్గన్ బౌలర్లపై ఏకంగా 14 సిక్సర్లతో మోర్గన్ స్టేడియం మోత మోగించాడు. 35 ఓవర్ల వద్ద ఇంగ్లాండ్ స్కోరు 200 పరుగులు దాటగా, 45 ఓవర్ కు ఏకంగా 325 పరుగులకు చేరుకుంది. అంటే పది ఓవర్లలో దాదాపు 125 పరుగులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: June 18, 2019, 6:12 PM IST
ICC World Cup 2019 | సిక్సర్లతో మోత మోగించిన మోర్గాన్...ఆఫ్గన్ బౌలర్లకు ఫ్రీగా ఎయిర్ షో...
మోర్గాన్
news18-telugu
Updated: June 18, 2019, 6:12 PM IST
England vs Afghanistan Live Score, ICC World Cup 2019 at Old Trafford: ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వీర విహారం చేసింది. ఆఫ్గనిస్తాన్ బౌలర్లపై ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ దండయాత్ర చేశారు. 45 ఓవర్లకే ఇంగ్లాండ్ స్కోరు 330 దాటింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెయిర్‌స్టో(90), జేమ్స్(26) శుభారంభం ఇవ్వగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మోర్గన్ సిక్సర్ల మోత మోగించాడు. ఆఫ్గన్ బౌలర్లపై ఏకంగా 14 సిక్సర్లతో మోర్గన్ స్టేడియం మోత మోగించాడు. 35 ఓవర్ల వద్ద ఇంగ్లాండ్ స్కోరు 200 పరుగులు దాటగా, 45 ఓవర్ కు ఏకంగా 325 పరుగులకు చేరుకుంది. అంటే పది ఓవర్లలో దాదాపు 125 పరుగులు నమోదయ్యాయి. మోర్గాన్ కు తోడుగా రూట్ కూడా బ్యాట్ ఝళిపించడంతో ఆఫ్గన్ బౌలర్లు నిశ్చేష్టులయ్యారు. రషీద్ ఖాన్ తన స్పెల్ లో ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మహ్మద్ నబీ కూడా 70 పరుగులు ఇచ్చాడు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...