ICC World Cup 2019 : పసికూన ఆఫ్గన్ పై ఇంగ్లాండ్ పంజా...150 పరుగుల భారీ తేడాతో ఆఫ్గనిస్తాన్ ఓటమి...

ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో లక్ష్యఛేదనలో ఆఫ్గనిస్తాన్ చతికిలా పడింది. 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆఫ్గన్ బ్యాట్స్ మెన్ శక్తి సరిపోలేదు. నిర్ణీత 50 ఓవర్లలో ఆఫ్గనిస్తాన్ 247/8 పరుగులు చేసి విజయానికి 150 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

news18-telugu
Updated: June 18, 2019, 10:53 PM IST
ICC World Cup 2019 : పసికూన ఆఫ్గన్ పై ఇంగ్లాండ్ పంజా...150 పరుగుల భారీ తేడాతో ఆఫ్గనిస్తాన్ ఓటమి...
విజయోత్సాహంలో ఇంగ్లాండ్ బౌలర్
news18-telugu
Updated: June 18, 2019, 10:53 PM IST
England vs Afghanistan Live Score, ICC World Cup 2019 at Old Trafford: ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో లక్ష్యఛేదనలో ఆఫ్గనిస్తాన్ చతికిలా పడింది. 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆఫ్గన్ బ్యాట్స్ మెన్ శక్తి సరిపోలేదు. దీంతో ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో ఆప్గనిస్తాన్ ను ఓడించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఓపెనర్ జద్రాన్ డకౌట్ కాగా, గుల్బదీన్ నయిబ్(37), రహ్మత్ షా(46), షహీదీ (76), అస్గర్ అఫ్గన్(44) క్రీజులో నిలబడి గౌరవ ప్రదమైన స్కోరు కోసం క్రీజులో నిలబడ్డారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆఫ్గనిస్తాన్ 247/8 పరుగులు చేసి విజయానికి 150 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కాగా ఈ విజయంతో ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది.



ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్‌పై ఇంగ్లాండ్ వీర విహారం చేసింది. ఆఫ్గనిస్తాన్ బౌలర్లపై ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ దండయాత్ర చేశారు. నిర్ణీత 50 ఓవర్లకు ఇంగ్లాండ్ 397/6 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లో ఇయాన్ మోర్గాన్ కేవలం 71 బంతుల్లో 148 పరుగులు చేశాడు. మోర్గాన్ సాధించిన స్కోరులో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. దీంతో మోర్గాన్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా సరికొత్త రికార్డు స్థాపించాడు. మోర్గన్ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ, ఏబీ డివిలీర్స్, క్రిస్ గేల్ 16 సిక్సర్లు బాది రెండో స్థానంలో సంయుక్తంగా ఉన్నారు. కాగా మొత్తం ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఏకంగా 25 సిక్సర్లు బాదారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ ఓపెనర్లు బెయిర్‌స్టో(90), జేమ్స్(26) శుభారంభం ఇవ్వగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మోర్గన్ సిక్సర్లతో ఆఫ్గన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మోర్గన్ బాదిన సిక్సర్లతో స్టేడియం మోత మోగింది. 35 ఓవర్ల వద్ద ఇంగ్లాండ్ స్కోరు 200 పరుగులు దాటగా, 45 ఓవర్ కు ఏకంగా 325 పరుగులకు చేరుకుంది. అంటే పది ఓవర్లలో దాదాపు 125 పరుగులు నమోదయ్యాయి. మోర్గాన్ కు తోడుగా రూట్ కూడా బ్యాట్ ఝళిపించడంతో ఆఫ్గన్ బౌలర్లు నిశ్చేష్టులయ్యారు. రషీద్ ఖాన్ తన స్పెల్ లో ఏకంగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మహ్మద్ నబీ కూడా 70 పరుగులు ఇచ్చాడు.
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...