భారత పర్యటనకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు రానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. భారత్‌తో ఇంగ్లండ్ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన టూర్ స్టార్ట్కానున్నది. అయితే అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 24వ తేదీన నుంచి రెండు జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్ట్ జరగనుంది. కోవిడ్ వల్ల ఇండియాలో అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మార్చిలో సౌతాఫ్రికా జట్టుతో జరగాల్సిన సిరీస్‌ను రద్దు చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను దుబాయ్‌లో నిర్వహించారు.
షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు, చెన్నైలో.. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు
రెండవ టెస్టు, చెన్నైలో.. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు
మూడవ టెస్టు, అహ్మదాబాద్‌లో.. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు
నాలుగవ టెస్టు, అహ్మదాబాద్‌లో.. మార్చి 4 నుంచి 8 వరకు
అయిదు టీ20 మ్యాచ్‌లనూ అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. మార్చి 12, 14, 16, 18, 20 తేదీల్లో ఆ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇక వన్డే మ్యాచ్‌లు పుణె వేదికగా జరగనున్నాయి. మార్చి 23, 26, 28వ తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.
🚨 #INDvENG schedule announced 🚨
🔹 Four #WTC21 Tests: 5 February ➜ 8 March
🔹 Five T20Is: 12 March ➜ 20 March
🔹 Three CWC Super League ODIs: 23 March ➜ 28 March
Are you ready? 😍 pic.twitter.com/7m0rWPsTBC
— ICC (@ICC) December 10, 2020
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇంగ్లండ్‌తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్ కొత్తగా నిర్మించిన మోతెరా స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్‌తో జరిగే క్రికెట్ సిరీస్‌ను కేవలం మూడు వేదికల్లో మాత్రమే నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, England, India, Pink, Team india