Home /News /sports /

ENGLAND TEST CAPTAIN BEN STOKES ANNOUNCED RETIREMENT FROM ODI CRICKET SJN

Ben Stokes Retirement : ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన బెన్ స్టోక్స్.. వన్డేలకు రిటైర్మెంట్.. కారణం ఇదేనా!

PC : TWITTER

PC : TWITTER

Ben Stokes Retirement : క్రికెట్ ఫ్యాన్స్ కు ఇంగ్లండ్ (England) టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) బిగ్ షాక్ ఇచ్చాడు. వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు 31 ఏళ్ల స్టోక్స్ సోమవారం ప్రకటించాడు.

Ben Stokes Retirement : క్రికెట్ ఫ్యాన్స్ కు ఇంగ్లండ్ (England) టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) బిగ్ షాక్ ఇచ్చాడు. వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు 31 ఏళ్ల స్టోక్స్ సోమవారం ప్రకటించాడు. మూడు ఫార్మాట్లు ఆడటం కష్టమని.. అందుకే తాను వన్డేల నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్లు స్టోక్స్ పేర్కొన్నాడు. వన్డేల్లో తన చివరి మ్యాచ్ ను భారత్ తో ఆడినట్లుగా కూడా అతడు పేర్కొన్నాడు. ఇకపై టెస్టు, టి20లపై దృష్టి పెడతానని పేర్కొనడం విశేషం. కొన్ని రోజుల క్రితమే ఇయాన్ మోర్గాన్ కూడా వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టోక్స్ ఇంగ్లండ్ టెస్టు జట్టుకు సారథిగా ఉన్నాడు.

ఇది కూడా చదవండి : ఇంగ్లండ్ కొంప ముంచిన బట్లర్.. అతడు ఆ పని చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.!

2019లో జరిగిన వన్డే ప్రపంచకప్ ను ఇంగ్లండ్ నెగ్గడంలో బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో అతడు 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బెన్ స్టోక్స్ అసాధారణ బ్యాటింగ్ కారణంగా మ్యాచ్ టైగా ముగుస్తుంది. అనంతరం సూపర్ ఓవర్ జరగ్గా అది కూడా టై అవుతుంది. అయితే బౌండరీల లెక్క ప్రకారం ఇంగ్లండ్ ప్రపంచ చాంపియన్ గా అవతరిస్తుంది. ’మూడు ఫార్మాట్లలో ఆడటం నాకు కష్టసాధ్యంగా మారింది. దాంతో వన్డేల నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నా. దీని వల్ల ప్రతిభ గల ప్లేయర్ కు ఇంగ్లండ్ జట్టులో స్థానం దక్కుతుంది. ఇకపై టెస్టు, టి20ల్లో మాత్రమే ఆడతా‘ అంటూ స్టోక్స్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు.



బెన్ స్టోక్స్ న్యూజిలాండ్ లో జన్మించాడు. కానీ అతడి చిన్నతనంలోనే అతడి ఫ్యామిలీ ఇంగ్లండ్ కు వలస వచ్చింది. క్రికెట్ మీద మక్కువతో దానిని కెరీర్ గా ఎంచుకున్నాడు. 2011లో వన్డేల్లో అరంగేట్రం చేసిన స్టోక్స్.. తక్కువ కాలంలోనే టి20, టెస్టుల్లో కూడా చోటు దక్కించుకున్నాడు. ఇక 2016లో జరిగిన టి20 ప్రపంచకప్ స్టోక్స్ కు పీడకల లాంటిది. వెస్టిండీస్ తో జరిగిన ఫైనల్ పోరులో బెన్ స్టోక్స్ చివరి ఓవర్లో నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఆ మ్యాచ్ లో బ్రాత్ వైట్ బెన్ స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాది విండీస్ ను విశ్వవిజేతగా నిలుపుతాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ లో మాత్రం స్టోక్స్ పట్టుదలగా ఆడి ఇంగ్లండ్ ను విశ్వ విజేతగా నిలిపాడు.



2020లో బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ బ్రెయిన్ క్యాన్సర్ తో మరణించాడు. అప్పటి నుంచి స్టోక్స్ మానసికంగా బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే అతడు మధ్య మధ్యలో క్రికెట్ కు విరామం కూడా ప్రకటించాడు. అందుకే అతడు తాను మూడు ఫార్మాట్లలో ఆడటం సాధ్యం కాదని తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. బెన్ స్టోక్స్ తన వన్డే కెరీర్ లో 104 మ్యాచ్ లు ఆడాడు. 2,919 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు మూడు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఇక భారత్ తో ముగిసిన వన్డే సిరీస్ లో అతడు 0, 21, 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, Icc world cup 2019, India vs england, Team India

తదుపరి వార్తలు