ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల ‘కబడ్డీ...కబడ్డీ’

మరో రెండు వారాల్లో ప్రారంభంకానున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లు భారత సాంప్రదాయక క్రీడ కబడ్డీ ఆడడం ఇక్కడి మీడియాలో హైలైట్ అవుతోంది.

news18
Updated: June 18, 2018, 11:27 AM IST
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల ‘కబడ్డీ...కబడ్డీ’
England players try their hand at Kabaddi. (Twitter)
  • News18
  • Last Updated: June 18, 2018, 11:27 AM IST
  • Share this:
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ పండుగ మరో రెండు వారాల్లో ప్రారంభంకానుంది. ప్రపంచ కప్‌ పోటీల్లో అమీతుమీ తేల్చుకునేందుకు అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ట్రైనింగ్ సెషన్స్‌లో ఆటగాళ్లు ఎడతెరపి లేకుండా చమటోడుస్తున్నాయి. పలు జట్లు వార్మప్ గేమ్స్ ఆడుతూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ సమరానికి సై అంటున్నాయి.

రష్యా వేదికగా జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్ గేమ్స్‌లో తమ ఫ్యాన్స్‌ మెప్పు పొందేందుకు ఇంగ్లండ్ జట్టు పక్కా ప్లాన్స్‌తో సన్నద్ధమవుతోంది. ప్రాక్టీస్ సందర్భంగా ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు కబడ్డీ ఆడారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు భారత సాంప్రదాయక క్రీడైన కబడ్డీ ఆడడాన్ని భారత మీడియా హైలైట్ చేస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు కబడ్డీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో కూడా చక్కర్లుకొడుతోంది.

ప్రో కబడ్డీ లీగ్‌ కారణంగా భారత్‌తో పాటు విదేశాల్లో కబడ్డీ క్రీడకు గత కొన్నేళ్లుగా విపరీతమైన క్రేజ్ వస్తోంది. తదుపరి ప్రో కబడ్డీ లీగ్ కోసం 422 మంది ఆటగాళ్ల వేలం పాట కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభంకానుంది.

రష్యా వేదికగా జూన్‌ 14 నుంచి 21వ ప్రపంచకప్‌ ఫుట్‌బాల్ సమరం ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు కనువిందు చేయనుంది. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్ జరిగే లుజ్నికి స్టేడియం, జులై 15న జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా వేదికకానుంది.

టోర్నమెంట్‌లో భాగంగా 32 జట్ల మధ్య 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. రష్యాలోని 11 ప్రధాన నగరాల్లోని 12 స్టేడియంలు మ్యాచ్‌లకు వేదికకానున్నాయి. మొత్తం 32 జట్లు 8 గ్రూప్‌లుగా విడిపోయి కప్ కోసం తలపడనున్నాయి. ఆతిథ్య రష్యా జట్టు గ్రూప్ ఏలో ఉండగా...హాట్ ఫ్యావరేట్ జట్లు స్పెయిన్, పోర్చుగల్ గ్రూప్ బీలో ఉన్నాయి. మరో హాట్ ఫ్యావరేట్ ఫ్రాన్స్ గ్రూప్ సీలోనూ...అర్జెంటీనా గ్రూప్ డీలోనూ ఉన్నాయి. బలమైన ఫుట్‌బాల్ జట్లుగా గుర్తింపు ఉన్న ఇటలీ, హాలండ్ జట్లు ఈ సారి ప్రపంచకప్‌లో లేకపోవడం ఆ దేశాల ఫుట్‌బాల్ ప్రియులకు నిరాశ కలిగిస్తోంది.
Published by: Janardhan V
First published: May 30, 2018, 5:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading