హోమ్ /వార్తలు /క్రీడలు /

England Cricket Team : ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్.. రీజన్ ఏంటంటే?

England Cricket Team : ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్.. రీజన్ ఏంటంటే?

ఇయాన్ మోర్గాన్ (PC : TWITTER)

ఇయాన్ మోర్గాన్ (PC : TWITTER)

England Cricket Team : ప్రపంచానికి క్రికెట్ ఆటను నేర్పింది ఇంగ్లండ్ (Engaland) అని అందరికీ తెలుసు. అటువంటి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తొలి ప్రపంచకప్ ను ముద్దాడడానికి దాదాపు ఐదు దశాబ్దాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఈ నిరీక్షణకు 2019లో తెరపడిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

England Cricket Team : ప్రపంచానికి క్రికెట్ ఆటను నేర్పింది ఇంగ్లండ్ (Engaland) అని అందరికీ తెలుసు. అటువంటి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తొలి ప్రపంచకప్ ను ముద్దాడడానికి దాదాపు ఐదు దశాబ్దాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఈ నిరీక్షణకు 2019లో తెరపడిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు చాంపియన్ గా నిలిచింది. ఫలితంగా ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్లు నాసిర్ హుస్సేన్, మైకేల్ వాన్, ఆండ్రా స్ట్రాస్, అలెస్టర్ కుక్ లకు సాధ్యం కాని దానిని మోర్గాన్ తన నాయకత్వంతో చేసి చూపించాడు. అయితే తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ ఇచ్చే పనిలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వన్డే, టి20లకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం. జూలై నెలలో భారత్ (India) తో ఇంగ్లండ్ టి20, వన్డే సిరీస్ లను ఆడాల్సి ఉంది. ఆ సిరీస్ ముగిసిన వెంటనే క్రికెట్ నుంచి మోర్గాన్ తప్పుకునే అవకాశం ఉందంటూ బ్రిటీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గార్డియన్ ప్రకారం జూలై నెలలో మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది.

ఇది కూడా చదవండి  : కెప్టెన్ గా ధోని, కోహ్లీ, రోహిత్ లకు సాధ్యం కాని పనిని.. సారథిగా తొలి మ్యాచ్ లోనే సాధించిన హార్దిక్

రిటైర్మెంట్ కారణం ఏంటీ..

వన్డేల్లోనూ, టి20ల్లోనూ ఇంగ్లండ్ కు అత్యధిక మ్యాచ్ లకు నాయకుడిగా ఉన్న సారథిగా మోర్గాన్ ఉన్నాడు. అయితే మోర్గాన్ ఆట గత కొన్ని నెలలుగా పూర్తిగా గాడి తప్పింది. అతడి వయసు 35 ఏళ్లే అయినా.. మునపటిలా రాణించలేకపోతున్నాడు. ఇటీవలె నెదర్లాండ్స్ తో ముగిసిన వన్డే సిరీస్ లోనూ ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు. రెండు మ్యాచ్ ల్లోనూ డకౌట్ అయ్యాడు. ఇక మూడో పోరులో గాయంతో ఆడలేదు. వారం రోజుల్లో భారత్ తో ఆరంభం అయ్యే సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. పూర్ ఫామ్, గాయాలు వంటి వాటితోనే మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

తదుపరి ఇంగ్లండ్ కెప్టెన్ ఎవరు?

ఆస్ట్రేలియా లాగే ఇంగ్లండ్ కూడా టెస్టులకు ఒక కెప్టెన్.. వన్డే, టి20లకు మరో కెప్టెన్ ను ఎంపిక చేస్తోంది. టెస్టులకు బెన్ స్టోక్స్ సారథిగా ఉన్నాడు. ఇక వన్డే, టి20లకు మోర్గాన్ తర్వాత జాస్ బట్లర్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. మోర్గాన్ లేని సమయాల్లో ఇంగ్లండ్ కు బట్లర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అందులోనూ బట్లర్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ లెక్కన మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ ను పరిమిత ఓవర్ల క్రికెట్ లో బట్లర్ నడిపించే అవకాశం ఉంది. ఇక మోర్గాన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లతో పాటు ఆర్సీబీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ఆడాడు. కేకేఆర్ కు 2021 సీజన్ లో సారథిగా కూడా వ్యవహరించాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మోర్గాన్ ను ఏ జట్టు కూడా వేలంలో కొనుగోలు చేయలేదు. దాంతో ఈ సీజన్ ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు.

First published:

Tags: Dinesh Karthik, England, Hardik Pandya, ICC Cricket World Cup 2019, India vs england, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు