ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes Series)లో ఇంగ్లండ్(England) పరిస్థితి దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మెల్బోర్న్ లో రెండున్నర రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. 68 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఆసీస్ జయకేతనం ఎగురవేసింది. ఆసీస్ దెబ్బకి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ పరాజయంతో పాటు ఐదు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ 18 ఏళ్ల చెత్త రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ఇది తొమ్మిదో పరాజయం.ఇంతకుముందు 2003లో బంగ్లాదేశ్ జట్టు ఆ ఏడాదిలో 9 పరాజయాలు చవిచూసింది.
తాజాగా ఇంగ్లండ్ సరిగ్గా ఏడాదిలో 9 పరాజయాలే అందుకొని బంగ్లాతో సమానంగా నిలిచింది. అయితే ఇంగ్లండ్ ఈ ఏడాది గెలిచిన సిరీస్ ఏదైనా ఉందంటే అది శ్రీలంకతో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవడం మాత్రమే. ఇక, ఇంగ్లండ్ టీమ్, ఆ దేశ మాజీ క్రికెటర్లపై టీమిండియా ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
గతంలో న్యూజిలాండ్ తో జరిగిన ఓ వన్డే మ్యాచ్ లో టీమిండియా 92 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో, అప్పట్లో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ విపరీతమైన ఆశ్చర్యం ప్రదర్శించాడు. సహజంగానే భారత్ పై ఒంటి కాలు మీద లేచే అతడు... హామిల్టన్ టీమిండియా ప్రదర్శనపై స్పందిస్తూ... "భారత్ 92 పరుగులకే కుప్పకూలింది. ఈ రోజుల్లో కూడా ఏ జట్టయినా 100 లోపే ఆలౌట్ అవుతుందంటే నమ్మలేకపోతున్నాను" అంటూ విడ్డూరంగా వ్యాఖ్యానించాడు.
England 68 all out @MichaelVaughan ? #Ashes pic.twitter.com/lctSBLOsZK
— Wasim Jaffer (@WasimJaffer14) December 28, 2021
Very good Wasim ??? https://t.co/OemxRrG2IF
— Michael Vaughan (@MichaelVaughan) December 28, 2021
అయితే, ఆనాడు వాన్ చేసిన వ్యాఖ్యలను టీమిండియా ఫ్యాన్స్ తో పాటు భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాత్రం మర్చిపోలేదు. సమయం కోసం కాచుకుని ఉన్నాడు. లేటెస్ట్ గా యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ మరీ దారుణంగా 68 పరుగులకే చేతులెత్తేసింది. ఇంకేముంది... "ఇంగ్లండ్ 68 ఆలౌట్" అంటూ మైఖేల్ వాన్ ను ఉద్దేశించి వసీం జాఫర్ ఓ ట్వీట్ చేశాడు. అందులో వాన్ గతంలో టీమిండియాను ఉద్దేశించి చేసిన ట్వీట్ ను కూడా జాఫర్ పొందుపరిచాడు.
92 all out Eng... can't believe any team would get bowled out for under 70 days these days!!!!!! @MichaelVaughan ?? pic.twitter.com/yHW3z9Lyer
— Aditya singh Rajput (@aditya_rajput30) December 28, 2021
— RS Gaming (@RaGhavyoutuber) December 28, 2021
ఆ విధంగా అదనుచూసి కౌంటర్ ఇచ్చాడు. అందుకు మైఖేల్ వాన్ మింగలేక కక్కలేక అన్నట్టు "వెరీ గుడ్ వసీం" అంటూ ఎమోజీలతో బదులిచ్చాడు.దీంతో, ఫ్యాన్స్ కూడా వసీం జాఫర్ ని పొగుడుతూ.. మైకేల్ వాన్ తిక్క కుదిరింది అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, ఆస్ట్రేలియా గడ్డపై ఎలా గెలవాలో టీమిండియా జట్టు దగ్గర సలహాలు తీసుకుంటే ఇంగ్లండ్ కు బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇది కూడా చదవండి : పంత్ సెంచరీ.. షమీ డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన భారత ఆటగాళ్లు..!
వాన్ భారత్ 92 పరుగులకు ఆలౌటైన సందర్భంలో చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తరచుగా చక్కర్లు కొడుతోంది. అతడు ఆ మాట ఏ సమయంలో అన్నాడో గానీ.. దాని తర్వాత నాలుగు సార్లు 90 పరుగుల లోపే ఆలౌటైంది ఇంగ్లాండ్. దీంతో 'మనం ఏం చేస్తే అది మనకు తిరిగొస్తుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.