హోమ్ /వార్తలు /క్రీడలు /

Eoin Morgan : క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ వరల్డ్ కప్ హీరో.. కారణం ఇదే

Eoin Morgan : క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ వరల్డ్ కప్ హీరో.. కారణం ఇదే

PC : ESPN Cricinfo

PC : ESPN Cricinfo

Eoin Morgan : ఇంగ్లండ్ (England) కు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) క్రికెట్ కు సంబంధించిన అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినా.. లీగ్ క్రికెట్ మాత్రం ఆడుతూ వస్తున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Eoin Morgan : ఇంగ్లండ్ (England) కు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) క్రికెట్ కు సంబంధించిన అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినా.. లీగ్ క్రికెట్ మాత్రం ఆడుతూ వస్తున్నాడు. ఇటీవలె ముగిసిన సౌతాఫ్రికా20 లీగ్ లో పర్ల్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. పర్ల్ రాయల్స్ సెమీస్ లో ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓడింది. ఇక సోమవారం మోర్గాన్ తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా పెట్టాడు.

ఐర్లాండ్  లో పుట్టి.. ఇంగ్లండ్ కెప్టెన్ గా ఎదిగి

ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జన్మించాడు. మొదట ఆ జట్టు తరఫునే అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించాడు. 2006లో ఐర్లాండ్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ తరఫున మోర్గాన్ 23 వన్డేలు ఆడి 744 పరుగులు సాధించాడు. అనంతరం ఐర్లాండ్ కు గుడ్ బై చెప్పి.. 2010లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరఫున ఎంట్రీ ఇచ్చాక మోర్గాన్ కెరీర్ ఊపందుకుంది. మొదట్లో ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా ఉన్న అతడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ తరఫున రాణించాడు.  2010-12 మధ్య 16 టెస్టులు ఆడిన అతడు 16 మ్యాచ్ ల్లో 700 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. అలెస్టర్ కుక్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో మోర్గాన్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. 2016లో జరిగిన టి20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ను ఫైనల్ వరకు చేర్చాడు. ఇక 2019లో జరిగిన ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ను చాంపియన్ గా నిలిపి.. అందని ద్రాక్షలా ఉన్న విశ్వవిజేత అనే ట్యాగ్ ను దక్కేలా చేశాడు. ఇంగ్లండ్ ను అత్యధికంగా 126 వన్డేల్లో కెప్టెన్ గా నడిపించాడు. టి20ల్లో 72 సార్లు ఇంగ్లండ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు.

ఆటగాడిగా కూడా ఇయాన్ మోర్గాన్ అద్భుతంగా రాణించాడు. 248 వన్డేలు ఆడిన మోర్గాన్ 7,701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు.. 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక టి20ల్లో 115 మ్యాచ్ లు ఆడి 2,458 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ లోనూ మోర్గాన్ ఫర్వాలేదనిపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ల తరఫున ఆడిన అతడు.. కేకేఆర్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇక లీగ్ క్రికెట్ లో మోర్గాన్ 370టిలు ఆడిన మోర్గాన్ 7,780 పరుగలు చేశాడు.

First published:

Tags: England, Icc world cup 2019, Retirement

ఉత్తమ కథలు