INDvsENG: రక్తం కారుతున్నా.. బౌలింగ్ చేయడం ఆపని లెజండరీ బౌలర్.. అతడి అంకితభావానికి హ్యాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్

రక్తం కారుతున్న బౌలింగ్ ఆపని లెజండరీ బౌలర్.. అతడికి హ్యాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్ (PC: Sony TV Grab/Twitter)

ఓవల్ జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఒక ఘటన చోటు చేసుకున్నది. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అంకిత భావానికి క్రికెట్ ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. గాయంతో రక్తం కారుతున్నా.. బౌలింగ్ మాత్రం ఆపకుండా క్రికెట్‌పై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

  • Share this:
    ఇంగ్లాండ్ (England) వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్నా వికెట్లు తీయడం ఆపలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు (Team India) అండర్సన్ బౌలింగ్ ఆడటానికి ఆపసోపాలు పడుతున్నది. పదునైన స్వింగ్ బంతులతో టీమ్ ఇండియాను ముప్పతిప్పలు పెడుతున్నాడు. లేటు వయసులో కూడా వికెట్ల మీద వికెట్లు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో అండర్సన్ ఆట పట్ల తనకు ఉన్న అంకిత భావాన్ని మరోసారి చాటుకున్నాడు. తొలి రోజు బౌలింగ్ చేస్తున్న సమయంలో జిమ్మీ మోకాళ్ల సమీపంలో ప్యాంటు రక్తంతో తడిసిపోయి కనపడింది. గాయం కారణంగా రక్తం కారుతున్నా.. జిమ్మీ మాత్రం బౌలింగ్ చేయడం ఆపలేదు. తన పూర్తి కోటాను జేమ్స్ అండర్సన్ పూర్తి చేశాడు.

    భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మిడాఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జిమ్మీ అండర్సన్ బంతిని ఆపబోయి గాయపడ్డాడు. అతడి గాయం నుంచి రక్తం కారుతున్నట్లు టీవీల్లో కూడా స్పష్టంగా కనిపించింది. అయినా సరే అండర్సన్ బౌలింగ్ చేయడం మాత్రం ఆపలేదు. సాధారణంగా బౌలర్లు రక్తం కారేలా గాయపడితే వెంటనే మైదానాన్ని వీడి ప్రథమ చికిత్స చేయించుకుంటారు. కానీ అండర్సన్ మాత్రం వెళ్లలేదు. ఎందుకంటే ఆ సమయంలో అజింక్య రహానే (Ajinkya Rahane), విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఎలాగైనా అతడి వికెట్ తీయాలనే పట్టుతదలతోనే అండర్సన్ పంతంతో తన బౌలింగ్ కొనసాగించాడని తెలుస్తున్నది. అండర్సన్ అలా బౌలింగ్ చేయడం చూసిన క్రికెట్ అభిమానులు అతడికి హ్యాట్సాఫ్ తెలియజేస్తున్నారు. జిమ్మీ నీ అంకిత భావం చాలా గొప్పది అని కామెంట్లు చేస్తున్నారు.





    తొలి రోజు 14 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన జేమ్స్ అండర్సన్ కీలకమైన జుజార వికెట్ పడగొట్టాడు. మరోసారి ఆఫ్ స్టంప్ అవతల బౌలింగ్ చేసి పుజారాను అవుట్ చేశాడు. భారత క్రికెటర్లు ఆఫ్ స్టంప్ పైన పడే బంతులను వదిలివేయకుండా వాటిని వెంటాడి అవుటవడం ఈ సిరీస్‌లో చూస్తూనే ఉన్నాము. పుజార కూడా అలాగే చేసి కీపర్ జానీ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీని రెండు సార్లు అవుట్ చేసిన అండర్సన్.. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రం అతడి వికెట్ తీయలేదు. జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. 2003లో క్రికెట్‌లోకి అడుగు పెట్టిన జిమ్మీ.. 166 టెస్టుల్లో 631 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు మూడుసార్లు 10 వికెట్ల హాల్, 31 సార్లు 5 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా జిమ్మీ రికార్డు సృష్టించాడు.

    Richest Cricketers: ఇండియాలో అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్లు ఎవరో తెలుసా? కోహ్లీ, ధావన్, జడేజా ఎంత సంపాదిస్తారు?

    Published by:John Naveen Kora
    First published: