news18-telugu
Updated: July 15, 2018, 12:13 AM IST
లార్డ్స్‌లో సెంచరీ సాధించిన తర్వాత అభివాదం చేస్తున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు రెండో మ్యాచ్ లో షాక్ తగిలింది. లార్డ్స్‌లో జరిగిన రెండు వన్డేలో ఆతిథ్య జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా ప్రత్యర్థిని ఢీకొట్టి క్రీజ్‌లో నిలబడే ప్రయత్నం చేయలేకపోయారు. అదే సమయంలో ఇంగ్లిష్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు.. 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేశారు. జో రూట్ 113 పరుగులతో రాణించగా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (53), డేవిడ్ విల్లీ (50 నాటౌట్) అర్ధశతకాలు సాధించి విరాట్ సేనకు టఫ్ టార్గెట్ ఇచ్చారు.
భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు రంగంలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ గెలుస్తుందన్న నమ్మకాన్ని ఇవ్వలేకపోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (15), శిఖర్ ధావన్ (36) వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ (45), సురేష్ రైనా (46) స్కోర్ కార్డు మీద నెంబర్లు పెంచగలిగారు. ధోనీ 37 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిగిలిన బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్‌కే
ఔటయ్యారు. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్ ప్లంకెట్ (4/46) చెలరేగడంతో భారత బ్యాట్స్‌మెన్ చాపచుట్టేశారు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెరోటి గెలిచి రెండు జట్లు సమంగా ఉన్నాయి. దీంతో మూడో మ్యాచ్ మీద అంచనాలు పెరిగాయి.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
July 15, 2018, 12:13 AM IST