T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు స్టార్ ప్లేయర్ అనుమానమే.. అదే జరిగితే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవు

టీ20 వరల్డ్ కప్‌కు స్టార్ ప్లేయర్ దూరం.. ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద నష్టం. (PC: ICC)

T20 World Cup: త్వరలో యూఏఈ వేదికగా ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. కాగా, వన్డే వరల్డ్ కప్ చాంపియన్ అయిన ఇంగ్లాండ్ .. టీ20ను కూడా గెలచుకోవాలనే పట్టుదలతో ఉన్నది. కానీ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ టోర్నీలో పాల్గొనేది సందిగ్దత నెలకొన్నది.

 • Share this:
  యూఏఈ (UAE) వేదికగా ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొననున్న అన్ని దేశాలు తమ జట్ల వివరాలను సెప్టెంబర్ 10లోగా పంపాలని ఐసీసీ ఆదేశించింది. దీంతో ఆయా దేశాలు 15 మంది క్రికెటర్లను సెలెక్ట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. కాగా, ఇంగ్లాండ్ (England) జట్టు స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనేది అనుమానమే అనే వార్తలు వస్తున్నాయి. మానసిక ఆరోగ్యం (Mental Health) సరిగా లేకపోవడం వల్ల అతడు ప్రస్తుతం క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్ కూడా ఆడలేనని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ అయినా ఆడతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  బెన్‌స్టోక్స్‌కు ఐపీఎల్ 2021 ఫస్ట్ ఫేజ్‌లో గాయపడ్డాడు. అతడి వేలికి చిన్నశస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తనకు మానసిక ఆరోగ్యం సరిగా లేనందున క్రికెట్‌కు కొన్ని రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు అతడు చెప్పాడు. కాగా, టీ20 వరల్డ్ కప్‌కు కూడా బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండబోవడం లేదని డైలీ మెయిన్ ఒక కథనాన్ని ప్రచురించింది. స్టోక్స్ తన సన్నిహితులతో టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడపై విముఖత ప్రకటించినట్లు తెలుస్తున్నది. మరోవైపు వచ్చే శుక్రవారం ఐసీసీ గడువు తీరనున్న సందర్భంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు స్టోక్స్‌పై ఒత్తిడి తీసుకొని వస్తున్నట్లు తెలుస్తున్నది. ఆడతానని ఒక్క మాట చెబితే తుది జట్టులో చేరుస్తామని.. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి మరో నెలన్నర సమయం ఉంది కాబట్టి ఇంతలో కోలుకునే అవకాశం ఉంటుందని స్టోక్స్‌ను బుజ్జగిస్తున్నది.

  Paralympics: పారాలింపిక్స్‌లో ప్రేమాయణం.. అథ్లెట్‌కు ప్రపోజ్ చేసిన కోచ్.. ఆ తర్వాత ఏం జరిగింది?
  ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చివరి సారిగా 2016లో ఇండియా వేదికగా జరిగింది. అప్పటి ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ జట్టు చేరుకున్నది. అయితే కార్లోస్ బ్రాత్‌వెయిట్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించి రెండో సారి కప్ గెలుచుకున్నది. కానీ 2019 వన్డే వరల్డ్ కప్‌ను ఇంగ్లాండ్ గెలుచుకున్నది. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు తొలి సారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడంలో బెన్‌స్టోక్స్‌దే కీలకపాత్ర. ఫైనల్‌లో అద్భుతంగా పోరాడి ఇంగ్లాండ్‌ను గెలిపించాడు. వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా బెన్‌స్టోక్స్ ఎన్నికయ్యాడు. కాగా, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కూడా గెలచుకొని ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించాలని భావిస్తున్నది. ఒకే సారి వన్డే, టీ20 వరల్డ్ చాంపియన్లుగా నిలిచిన ఏకైక జట్టుగా ఇంగ్లాండ్‌కు ఆ అవకాశం రానున్నది. కాబట్టి ఈ కీలక టోర్నీకి బెన్‌స్టోక్స్ ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు. అతడి లేకపోతే ఆ లోటు తప్పకుండా ఇంగ్లాండ్‌కు భారంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి స్టోక్స్ చివరకు ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.

  Paralympics: భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమే.. బ్యాడ్మింటన్‌లో ఫైనల్ చేరిన భారత షట్లర్లు  Published by:John Naveen Kora
  First published: