Home /News /sports /

ENGLAND ALL ROUNDER MOEEN ALI TESTS POSITIVE SA

క్రికెట్‌కు కరోనా.. టీమిండియాకు ప్రోటోకాల్ కష్టాలు.. ఆల్‌రౌండర్‌కి పాజిటివ్

క్రికెట్‌లో కరోనా కలకలం స్పష్టిస్తోంది. ఐపీఎల్‌తో మెుదలైన కరోనా కలవరం క్రమంగా జాతీయ జట్టులో కలకలం సృష్టిస్తో్ంది. దక్షిణాఫ్రికా,శ్రీలంక,ఇంగ్లాండ్ లాంటి జట్లలోని ఆటగాళ్ళకు కరోనా సోకడం.

క్రికెట్‌లో కరోనా కలకలం స్పష్టిస్తోంది. ఐపీఎల్‌తో మెుదలైన కరోనా కలవరం క్రమంగా జాతీయ జట్టులో కలకలం సృష్టిస్తో్ంది. దక్షిణాఫ్రికా,శ్రీలంక,ఇంగ్లాండ్ లాంటి జట్లలోని ఆటగాళ్ళకు కరోనా సోకడం.

క్రికెట్‌లో కరోనా కలకలం స్పష్టిస్తోంది. ఐపీఎల్‌తో మెుదలైన కరోనా కలవరం క్రమంగా జాతీయ జట్టులో కలకలం సృష్టిస్తో్ంది. దక్షిణాఫ్రికా,శ్రీలంక,ఇంగ్లాండ్ లాంటి జట్లలోని ఆటగాళ్ళకు కరోనా సోకడం.



    క్రికెట్‌లో కరోనా కలకలం స్పష్టిస్తోంది. ఐపీఎల్‌తో మెుదలైన కరోనా కలవరం క్రమంగా జాతీయ జట్టులో కలకలం సృష్టిస్తో్ంది. దక్షిణాఫ్రికా,శ్రీలంక,ఇంగ్లాండ్ లాంటి జట్లలోని ఆటగాళ్ళకు కరోనా సోకడం.. తాజాగా వీండిస్, టీమిండియా ఆటగాళ్ళు కోవిడ్ ప్రోటోకాల్ దిక్కరించడం వంటివి ఆటకు విఘాతం కలిగిస్తున్నాయి. కరోనా కారణంగా పకడ్బంది చర్యలతో క్రికెట్ నిర్వహణకు కోసం ఐసీసీ కృషి చేస్తుంటే.. ఆ ప్రయత్నానికి ఆటగాళ్ళు తుట్లు పోడుస్తున్నారు

    భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ, పృథ్వీ షాలు బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించినట్టుగా వారిపై ఆరోపణలు వచ్చాయి. వీళ్లు ఐదుగురు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రొటోకాల్‌కు వ్యతిరేకంగా న్యూ ఇయర్ సందర్భంగా మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తినడంతో ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆ ఐదురుగు క్రికెటర్లను ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో వీరు మిగతా టీమ్ సభ్యులతో కలిసి జనవరి 4వ తేదీన సిడ్నీకి వెళ్లకపోవచ్చనే వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్స్ అందరికి కరోనా నెగిటివ్‌గా తేలిందని BCCI ప్రకటించడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు.

    న్యూజిలాండ్‌ పర్యటన కోసం వచ్చిన వెస్టిండీస్‌ ఆటగాళ్లు కరోనా ప్రొటోకాల్ నియమాలను ఉల్లఘించారు. క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు నిబంధనల్ని అతిక్రమించి బయటకువచ్చారు. ఆటగాళ్ళు భౌతిక దూరం పాటిస్తూ 14 రోజుల పాటు క్వారంటైన్‌ ఉండాలి. ఆ రూల్స్ ఏమి పాటించకుండా తాము బస చేసిన హోటల్లో ఇష్టానుసరంగా ప్రవర్తించారు. భౌతిక దూరం పాటించకుండా.. భోజన సమయంలో ఆహార పదార్థాలను షేరు చేసుకున్నారు. ఈ పరిణామాలన్ని న్యూజిలాండ్‌ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది.

    దక్షిణాఫ్రికా గడ్డపై ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కి కరోనా కారణంగా విఘాతం కలిగింది. ఈ మ్యాచ్ ముంగిట సఫారీ టీమ్‌లో ఓ ఆటగాడికి కరోనా సోకింది. దీంతో డిసెంబరు 4న జరగాల్సిన తొలి వన్డే డిసెంబరు 6కి వాయిదా పడింది. ముందు నుంచే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా కరోనా వైరస్ బారిన పడుతూ వచ్చారు.

    తాజాగా ఇంగ్లాండ్ టీమ్‌లో కరోనా కలకలం రేపింది.శ్రీలంకతో టెస్ట్ సిరీప్ ముంగిట ఇలాంటి పరిణామం జరగడం సిరీస్‌పై నీలినీడాలు కమ్ముకున్నాయి. జనవరి 14 నుంచి వరుసగా రెండు టెస్టుల సిరీస్‌లు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది ఇంగ్లాండ్ టీమ్‌. తాజాగా ఇంగ్లీష్ టీం మెంబర్స్‌కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా మొయిన్ అలీకి కోవిడ్ సోకినట్లు తేలింది. దీంతో ఆలీతో పాటు అతనికి సన్నిహింతంగా మెగిలిన ఫాస్ట్ బౌలర్ క్రిస్‌వోక్స్‌‌‌ని ఐసోలేషన్‌కి తరలించారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు