Home /News /sports /

ENGLAND ALL ROUNDER MOEEN ALI HAS DECIDED TO RETIRE FROM TEST CRICKET AND ECB SAID IN A PRESS RELEASE SRD

Moeen Ali : క్రికెట్ లవర్స్ కు షాకిచ్చిన మొయిన్ అలీ.. ఆ ఫార్మాట్ కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్ బై..!

Moeen Ali

Moeen Ali

Moeen Ali : చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాటర్.. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ (Moeen Ali) క్రికెట్ ఫ్యాన్స్ కు షాకిచ్చాడు.

    చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాటర్.. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ (Moeen Ali) క్రికెట్ ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. రాబోయే యాషెస్​ 2021 సిరీస్‌ సమయంలో మొయిన్​ అలీ రిటైర్మెంట్​ ప్రకటించే అవకాశాలున్నాయని బ్రిటిష్ మీడియా పేర్కొనగా.. అంతకుముందే అలీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. లిమిటెట్ ఓవర్ల క్రికెట్ లో తన కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగించేందుకే.. అలీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను రిటైర్ అవుతున్న విష‌యాన్ని మొయిన్ అలీ గతంలోనే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌, హెడ్ కోచ్ క్రిస్ సిల్వ‌ర్‌వుడ్‌కు తెలిపాడట. వారితో పాటు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒప్పుకోవడంతో.. తాజాగా మొయిన్ అలీ అధికారకంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

    ఇంగ్లండ్ త‌ర‌ఫున 64 టెస్టులు ఆడిన మొయిన్ అలీ 2914 ప‌రుగులు చేశాడు. 195 వికెట్లు కూడా తీశాడు. టెస్టుల్లో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక స్కోర్ 155 నాటౌట్. 53 పరుగులు ఇచ్చి 6 వికెట్లు కూడా పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్ త‌ర్వాత మొయిన్ అలీ పెద్ద‌గా టెస్ట్ క్రికెట్‌లో క‌నిపించ‌లేదు. ఇటీవల టీమిండియాతో టెస్ట్ సిరీస్‌లో మ‌ళ్లీ చోటు ద‌క్కించుకున్న అలీ.. మూడు టెస్టుల్లో ఆడాడు. అయితే పెద్దగా ప్రభావం మాత్రం చూపలేకపోయాడు.

    " నాకు ఇప్పుడు 34 ఏళ్లు. సంప్రదాయ క్రికెట్ ఆడేందుకు నా శరీరం సహకరించకపోవచ్చు. టెస్ట్ క్రికెట్ ఓ అద్భుతమైన ఫార్మాట్. రిటైర్ ప్రకటిస్తున్నందుకు ఎంతో బాధపడుతున్నా. లిమిటెట్ క్రికెట్ లో రాణించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా " అని మొయిన్ అలీ ప్రకటించనట్లు ఈసీబీ పేర్కోంది.

    మొయిన్​ అలీ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021​లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు తరఫున మొయిన్​ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2021లో అలీ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో బరిలోకి దిగి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

    ఇది కూడా చదవండి : ప్చ్.. ఇదేం బ్యాటింగ్ డాడీ..! డివిలియర్స్ ఔటవ్వగానే కుర్చీని తన్నిన జూనియర్ ఏబీ.. ఆ తర్వాత

    ఐపీఎల్ 2021 తొలి దశలో ఆకట్టుకున్న అలీ.. రెండో దశలో కూడా రాణిస్తున్నాడు. అబుదాబి వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో అలీ 28 బంతుల్లో 32 రన్స్ చేశాడు. దాంతో చెన్నై విజయం వైపు దూసుకెళ్లింది. 19వ ఓవర్లో రవీంద్ర జడేజా వరుస బౌండరీలతో చెలరేగడంతో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న విషయం తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, Cricket, England, IPL 2021, Test Cricket

    తదుపరి వార్తలు