SA W vs ENG W : ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్ లో సౌతాఫ్రికా (South Africa) మహిళల జట్టు ప్లేయర్ మరిజాన్ కేప్ (Marizanne kapp) రకార్డుల మోత మోగించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా బ్యాటింగ్ కు దిగింది. ఆరంభంలో ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా కేట్ క్రాస్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో.. ప్రొటీస్ జట్టు 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మరిజాన్ కేప్ ఒంటిరి పోరాటం చేసింది. సునె లూస్ (27), బాష్ (30)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పింది. ఈ క్రమంలో కేప్ తన కెరీర్ లో మొదటి టెస్టు సెంచరీని అందుకుంది. ఆమె ఈ మ్యాచ్ లో 213 బంతుల్లో 26 ఫోర్లతో 150 పరుగులు చేసింది. ఫలితంగా సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 91.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.
కేప్ భారీ శతకం సాధించడంతోపాటు ఆమె మహిళల టెస్టు క్రికెట్ లో రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా కేప్ నిలవడంతో పాటు 61 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టింది. 1961లో అప్పటి సఫారీ ప్లేయర్ వైవోన్ వాన్ మెంట్జ్ ఇంగ్లండ్ పై ఒక టెస్టు మ్యాచ్ లో 105 పరుగులు చేసింది. ఇప్పటి వరకు కూడా ఇదే అత్యధిక స్కోరుగా ఉండగా.. తాజాగా ఆ రికార్డును కేప్ బద్దలు కొట్టింది. వీటితో పాటు మరికొన్ని రికార్డులను కూడా కేప్ తన పేరిట లిఖించుకుంది.
The highest individual score by a South Africa batter in women's Tests!
Marizanne Kapp, take a bow ???? #ENGvSA LIVE: https://t.co/kRHudMeAJI pic.twitter.com/9c2Ba9uCER
— ESPNcricinfo (@ESPNcricinfo) June 27, 2022
మహిళల టెస్టుల్లో ఆరు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన తొలి క్రికెటర్‌గా కేప్ నిలిచింది. అంతేకాకుండా మహిళల టెస్టుల్లో అత్యంత వేగంగా 150 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కేప్ ఘనత వహించింది. కేప్ 212 బంతుల్లో 150 పరుగుల మార్కును అందుకుంది. గతంలో ఆసీస్ ప్లేయర్ కరెన్ రొల్టాన్ 213 బంతుల్లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, England, ICC, Mithali Raj, Rohit sharma, Smriti Mandhana, South Africa, Team India, Virat kohli