ENG W vs SA W : మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023)లో రెండో సెమీఫైనల్ కు రంగం సిద్ధమైంది. తొలి సెమీఫైనల్లో భారత్ (India)పై నెగ్గిన ఆస్ట్రేలియా (Australia) ఫైనల్ బెర్త్ ను సొంతం చేసుకుంది. శుక్రవారం ఇంగ్లండ్ (England), దక్షిణాఫ్రికా (South Africa) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఈ నెల 26న (ఆదివారం) జరిగే తుది పోరులో ఆసీస్ తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. మరోవైపు ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. ఫ్రెయ డేవిస్ స్థానంలో లారెన్ బెల్ ను తుది జట్టులోకి తీసుకుంది.
ఈ టోర్నీలో ఇంగ్లండ్ దూకుడు మీద ఉంది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. పాకిస్తాన్ తో జరిగిన పోరులో 200కు పైగా పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్ ఎంటో చాటింది. ఇక బౌలింగ్ లో కూడా ఇంగ్లండ్ పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో డ్యానీ వ్యాట్, నాట్ సీవర్, అమీ జోన్స్ లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో ఎకెల్ స్టోన్, బెల్ లు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.
ఇక సౌతాఫ్రికా విషయానికి వస్తే.. తొలి మ్యాచ్ లో శ్రీలంక చేతిలో ఓటమితో టోర్నీని ఆరంభించింది. అనంతరం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లను ఓడించింది. లీగ్ దశ ముగిసిన తర్వాత కివీస్ తో సమానంగా 4 పాయింట్లతో నిలిచినా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్ లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్ ను ఓడించాలంటే సౌతాఫ్రికా శక్తికి మించి రాణించాల్సి ఉంది. లారా బ్రిట్స్ లు రాణించాల్సి ఉంది. సౌతాఫ్రికా బౌలింగ్ ను ఎదుర్కొనడం ఇంగ్లండ్ కు అంత సులభంగా ఉండే అవకాశం లేదు. ఇక సొంత ప్రేక్షకుల మధ్య టోర్నీ జరుగుతుండటం సౌతాఫ్రికాకు కలిసి వచ్చే అంశం.
తుది జట్లు
సౌతాఫ్రికా మహిళల జట్టు
సునె లూస్ (కెప్టెన్), లారా వొల్వార్డ్, బ్రిట్స్, క్యాప్, ట్రయాన్, బోష్, డె క్లెర్క్, సినాలో జఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయబొంగ ఖఖా, నాన్ కులెలోక్కో మ్లాబా,
ఇంగ్లండ్ మహిళల జట్టు
హీథర్ నైట్ (కెప్టెన్), డ్యానీ వ్యాట్, సోఫియా డంక్లీ, అలైస్ క్యాప్సీ, నాట్ సీవర్ బ్రంట్, అమీ జోన్స్, సోఫీ ఎకెల్ స్టోన్, కేథరిన్ సీవర్, సారా గ్లెన్, చార్లీ డీన్, లారెన్ బెల్,
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: England, South Africa, Womens T20 World Cup