హోమ్ /వార్తలు /క్రీడలు /

ENG W vs SA W : రాణించిన సౌతాఫ్రికా ఓపెనర్లు.. రెండో సెమీస్ లో ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్.. ఎంతంటే?

ENG W vs SA W : రాణించిన సౌతాఫ్రికా ఓపెనర్లు.. రెండో సెమీస్ లో ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్.. ఎంతంటే?

PC : ICC

PC : ICC

ENG W vs SA W : ఇంగ్లండ్ మహిళల జట్టు (England Women's Team)తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల (South Africa Women's Team) జట్టు మంచి స్కోరును సాధించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ENG W vs SA W : ఇంగ్లండ్ మహిళల జట్టు (England Women's Team)తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల (South Africa Women's Team) జట్టు మంచి స్కోరును సాధించింది. మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023) ఫైనల్లో భాగంగా జరుగుతున్న రెండో సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు లారా వోల్వార్డ్ (44 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్), తాజ్మిన్ బ్రిట్స్ (55 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో మారిజానె క్యాప్ (13 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడుగా ఆడింది. దాంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరును అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకెల్ స్టోన్ 3 వికెట్లతో రాణించింది. ఆమె మినహా మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు లారా, బ్రిట్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడారు. దాంతో స్కోరు బోర్డు చాలా నెమ్మదిగా కదిలింది. అయితే కుదురుకున్నాక లారా ధాటిగా ఆడటం మొదలు పెట్టింది. మరో ఎండ్ లో ఉన్న బ్రిట్స్ స్ట్రయిక్ రొటేట్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో లారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం భారీ షాట్ కు ప్రయత్నించి అవుటైంది. దాంతో 96 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఇక్కడి నుంచి బ్రిట్స్ హిట్టింగ్ కు దిగింది. లారా ఉన్నంతసేపు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన బ్రిట్స్ ఒక్కసారిగా ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగింది.

అదే సమయంలో ఇంగ్లండ్ ఫీల్డర్లు పేలవ ఫీల్డింగ్ తో ప్రత్యర్థికి పరుగులు సమర్పించుకున్నారు. ఫోర్ తో బ్రిట్స్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది.  అయితే చివర్లో బ్రిట్స్ అవుటయ్యాక సౌతాఫ్రికా వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే చివరి ఓవర్లో క్యాప్ బౌండరీల వర్షం కురిపించడంతో సౌతాఫ్రికా 164 పరుగులకు చేరుకుంది.

తుది జట్లు

సౌతాఫ్రికా మహిళల జట్టు

సునె లూస్ (కెప్టెన్), లారా వొల్వార్డ్, బ్రిట్స్, క్యాప్, ట్రయాన్, బోష్, డె క్లెర్క్, సినాలో జఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయబొంగ ఖఖా, నాన్ కులెలోక్కో మ్లాబా,

ఇంగ్లండ్ మహిళల జట్టు

హీథర్ నైట్ (కెప్టెన్), డ్యానీ వ్యాట్, సోఫియా డంక్లీ, అలైస్ క్యాప్సీ, నాట్ సీవర్ బ్రంట్, అమీ జోన్స్, సోఫీ ఎకెల్ స్టోన్, కేథరిన్ సీవర్, సారా గ్లెన్, చార్లీ డీన్, లారెన్ బెల్,

First published:

Tags: England, South Africa, Womens T20 World Cup

ఉత్తమ కథలు