ENG W vs IND W : టీమిండియా క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా నడుచుకుందా..? ఇంగ్లండ్ కెప్టెన్ రనౌట్ విషయంలో పెద్ద రచ్చ..

Photo Credit : Twitter

ENG W vs IND W : ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్(30) అనూహ్య రీతిలో రనౌట్ అవ్వడం భారత్‌కు కలిసొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రనౌట్ పై భిన్న వాదలు విన్పిస్తున్నాయ్.

  • Share this:
    టీమిండియా మహిళలు ప్రస్తుతం ఇంగ్లండ్ టీంతో మూడు టీ20ల సిరీస్ లో తలపడుతోంది. నిన్న జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 1-1 తో సమం చేసింది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియాకు అదృష్టం కలిసొచ్చింది. ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్(30) అనూహ్య రీతిలో రనౌట్ అవ్వడం భారత్‌కు కలిసొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీప్తి శర్మ వేసిన 14వ ఓవర్‌లో వరుస బంతుల్లో ఓపెనర్ బీమాంట్(59), కెప్టెన్ హీథర్‌నైట్(30) ఔటవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. బీమౌంట్ వికెట్ల ముందు దొరికిపోగా.. హీథర్ నైట్ విచిత్రకర రీతిలో రనౌట్‌గా వెనుదిరిగింది. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న హీథర్ నైట్ క్రీజు ధాటగా.. స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ ఆడిన బంతి నేరుగా దీప్తి శర్మ షూకు తగిలి వికెట్లపై పడింది. అప్పటికీ హీథర్ నైట్ క్రీజులో బ్యాట్ పెట్టకపోవడంతో భారత మహిళలు అప్పీలు చేశారు. అంపైర్ సమీక్ష కోరగా పలు కోణాల్లో పరిశీలించిన అంపైర్ ఔటిచ్చాడు. అయితే ఈ రనౌట్ ప్రస్తుతం వివాదాస్పదంగా తయారైంది.

    ఈ విషయంలో కొందరు క్రికెటర్లు భిన్న స్వరాలు విన్పిస్తున్నారు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ అలెక్స్ .."కావాలనే బ్యాట్స్ మెన్ ని అడ్డుకుందని, ఇది నాటౌట్ అని " పేర్కొన్నాడు. అలాగే మార్క్ బౌచర్ మాట్లాడుతూ, " బౌలర్.. బ్యాట్స్ మెన్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోకపోయి ఉంటే.. ఇంగ్లండ్ కెప్టెన్ ఔట్ అయినట్లే కదా" అంటూ తన బాణిని వినిపించారు. అయితే, ఈ రనౌట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే, ఐసీసీ రూల్స్ మేరకు చేతల ద్వారా గానీ, మాటల ద్వారా కానీ లేదా ఉద్దేవపూర్వకంగా బ్యాట్స్ మెన్ ను బౌలర్ అడ్డుకుంటే తప్పకుండా శిక్షకు అర్హులే. అయితే, దీప్తి శర్మ కావాలని అడ్డుకున్నంటూ అందులో లేదు. ప్రస్తుతం ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చజరుగుతుంది.

    ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. షెఫాలీ ధనాధన్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చింది. స్మృతి మంధాన(20), షెఫాలీ వర్మ ఫస్ట్ వికెట్‌కు 70 రన్స్ భాగస్వామ్యం అందించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(31)తో పాటు దీప్తీ శర్మ(24 నాటౌట్) రాణించారు. ఇంగ్లిష్ బౌలర్లలో సివర్, డేవిస్, సారా గ్లెన్, మాడీ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం చేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన ఇంగ్లీష్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 140 రన్స్ చేసి ఓడింది. ఓపెనర్ బీమాంట్(59), కెప్టెన్ హీథర్‌నైట్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్(2/17) రెండు వికెట్లు తీయగా.. దీప్తీ శర్మ, అరుందతీ రెడ్డిలకు తలో వికెట్ దక్కింది.
    Published by:Sridhar Reddy
    First published: