ENG W vs IND W : అదరగొట్టిన అమ్మాయిలు..రెండో టీ-20 మ్యాచ్ టీమిండియాదే..

Photo Credit : Twitter

ENG W vs IND W : భారత అమ్మాయిలు అదరగొట్టారు. సిరీస్ లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సత్తా చాటారు. రెండో టీ-20 లో ఇంగ్లండ్ మహిళా టీమ్.. టీమిండియా చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

  • Share this:
    భారత అమ్మాయిలు అదరగొట్టారు. సిరీస్ లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సత్తా చాటారు. రెండో టీ-20 లో ఇంగ్లండ్ మహిళా టీమ్ టీమిండియా చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీ-20 సిరీస్ 1-1 తో సమం అయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఫస్ట్ టీ-20లో 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. సిరీస్ నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది హర్మన్ ప్రీత్ సేన. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఫెఫాలీ వర్మ 38 బంతుల్లో 48 పరుగులు, హర్మన్ ప్రీత్ 25 బంతుల్లో 31 పరుగులతో సత్తా చాటారు. నటాలీ సివర్, డేవిస్, విల్లర్స్, సారా గ్లెన్ తలా ఓ వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు ఫస్ట్ వికెట్ కు 70 పరుగుల పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. అయితే 20 పరుగులు చేసిన స్మృతి డేవిస్ బౌలింగ్ ఔటైంది. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న ఫెఫాలీ వర్మ కూడా వెంటనే ఔటైంది. దీంతో 72 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

    ఆ తర్వాత హర్మన్, దీప్తి ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు. అయితే, దీప్తి స్లోగా ఆడటంతో..హర్మన్ ప్రీత్ దూకుడుగా ఆడాల్సి వచ్చింది. రెండు సిక్సర్లు కొట్టి ఊపు మీద కన్పించిన హర్మన్ ప్రీత్ ని సారా గ్లెన్ ఔట్ చేయడంతో భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఓ దశలో 170 పరుగులు చేస్తుందనుకున్న భారత్ 148 పరుగులకే తమ ఇన్నింగ్స్ ని ముగించింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ బీమౌంట్ 50 బంతుల్లో 59 ఒంతుల్లో చెలరేగిన.. తన జట్టుకు విజయాన్ని అందించలేక పోయింది.


    ఓ దశలో 13 ఓవర్లకే వంద పరుగులు చేసిన ఇంగ్లండ్..విజయాన్ని సునాయసంగా అందుకుంటుందని అనుకున్నారంతా. కానీ, టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో.. ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో మ్యాచ్ ను చేజార్చుకుంది. భారత బౌలర్లలో పునమ్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. దీప్తి, అరుంధతి రెడ్డి చెరో వికెట్ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ రూపంలో వచ్చాయ్. ఆల్ రౌండ్ షో చేసిన దీప్తి శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక, ఇరు జట్ల మధ్య ఈ నెల 14 న మూడో టీ-20 మ్యాచ్ జరగనుంది.
    Published by:Sridhar Reddy
    First published: