Home /News /sports /

ENG VS SA SOUTH AFRICA CRICKETER TRISTAN STUBBS TAKES BLINDER AT COVERS OF MOEEN ALI IN 3RD T20I OF SA VS ENG SJN

ENG vs SA : సూపర్ మ్యాన్ క్యాచ్ పడితే ఇలానే ఉంటుందేమో.! ఈ క్యాచ్ చూస్తే మీరు వావ్ అనాల్సిందే

PC : TWITTER

PC : TWITTER

ENG vs SA : ఇంగ్లండ్ (England)తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా (South Africa) పవర్ హిట్టర్ ట్రిస్టాన్ స్టబ్స్ (Tristan Stubbs) అద్భుత క్యాచ్ తో మెరిశాడు. అతడి క్యాచ్ ను చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.

ENG vs SA : ఇంగ్లండ్ (England)తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా (South Africa) పవర్ హిట్టర్ ట్రిస్టాన్ స్టబ్స్ (Tristan Stubbs) అద్భుత క్యాచ్ తో మెరిశాడు. అలాంటి ఇలాంటి క్యాచ్ తో కాదు.. నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ అందుకున్న స్టబ్స్.. ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్ రౌండర్ మొయిన్ అలీని తక్కువ స్కోరుకే పెవిలియన్ కే చేరేలా చేశాడు. అతడి క్యాచ్ ను చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఇక తొలి టి20లో ఓడిన సౌతాఫ్రికా జట్టు అనంతరం జరిగిన రెండు టి20ల్లోనూ విజయం సాధించిం సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి  : ’అదే నా చివరి లక్ష్యం.. దాని కోసం తీవ్రంగా కష్ట పడుతున్నా‘.. కార్తీక్ కాకాతో అట్లే ఉంటది మరీ!

సిరీస్ విజేతను తేల్చే చివరిదైన మూడో టి20 మ్యాచ్ లో 191 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (17), కెప్టెన్ జాస్ బట్లర్ (14)తో సహా డేవిడ్ మలాన్ (7) విఫలం అయ్యారు. అయితే జానీ బెయిర్ స్టో (27), మొయిన్ అలీ (3) రూపంలో ఇద్దరు విధ్వంసకర ప్లేయర్లు క్రీజులో ఉండటంతో సౌతాఫ్రికా కాస్త కంగారుగానే ఉంది. వీరిద్దరూ తొలి టి20లో ఒక రేంజ్ లో ఆడారు. అయితే మార్కరమ్ వేసిన 10వ ఓవర్ చివరి బంతిని మొయిన్ అలీ కవర్స్ దిశగా ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. అయితే కవర్స్ కు కొద్దిగా కుడి వైపున ఫీల్డింగ్ చేస్తోన్న స్టబ్స్.. తన ఎడమవైపుకు పరుగెత్తుతూ గాల్లోకి లేచి కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ సింగిల్ హ్యాండ్ అద్భుతమైన క్యాచ్ కు మొయిన్ అలీ పెవిలియన్ కు చేరాడు. ఆ క్యాచ్ ను మీరూ చేసేయండి మరీ.



ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (0) డకౌట్ అయినా.. రీజా హెండ్రిక్స్ (50 బంతుల్లో 70; 9 ఫోర్లు), మార్కరమ్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రైలీ రూసోవ్ (18 బంతుల్లో 31; 6 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (9 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్లు ఆడారు. ఫలితంగా సౌతాఫ్రికా భారీ స్కోరును అందుకుంది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ ను షమ్సీ 5 వికెట్లతో హడలెత్తించాడు. ఫలితంగా ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. షమ్సీతో పాటు కేశవ్ మమరాజ్ 2 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ తరఫున జానీ బెయిర్ స్టో (27; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలువడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, England, India Vs Westindies, Rohit sharma, Smriti Mandhana, South Africa, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు