Home /News /sports /

Eng Vs Sa : ర‌ఫ్ ఆడించిన ర‌బాడా.. ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్

Eng Vs Sa : ర‌ఫ్ ఆడించిన ర‌బాడా.. ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్

క‌గిసో రబాడా (ఫోటో క్రెడిట్  ఇన్‌స్టాగ్రామ్‌)

క‌గిసో రబాడా (ఫోటో క్రెడిట్ ఇన్‌స్టాగ్రామ్‌)

టీ-20 ప్రపంచకప్ గ్రూప్ -1 లో నుంచి ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకున్నాయ్. డూ ఆర్ డై మ్యాచులో సౌతాఫ్రికా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఆ దేశ బౌల‌ర్ కగిసో రబాడా (Kagiso Rabada) చివ‌రి ఓవ‌ర్లో హ్యాట్రిక్ సాధించి స‌త్తా చాటాడు.

ఇంకా చదవండి ...
    టీ-20 ప్రపంచకప్ గ్రూప్ -1 లో నుంచి ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకున్నాయ్. డూ ఆర్ డై మ్యాచులో సౌతాఫ్రికా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఆ దేశ బౌల‌ర్ కగిసో రబాడా (Kagiso Rabada) చివ‌రి ఓవ‌ర్లో హ్యాట్రిక్ సాధించి స‌త్తా చాటాడు. తాను మెరుగైన బౌల‌ర్ (Bowler) అని నిరుపించాడు. అన్ని ర‌కాల ఫార్మెట్‌ (Format)లో వికెట్లు తీయ‌గ‌ల‌డ‌ని నిరూపించాడు. ఇంగ్లాండ్ జ‌ట్టు ఇప్ప‌టికే సెమీస్ బెర్తును ఖరారు చేసుకొంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను దక్షిణాఫ్రికా (South Africa) 130 పరుగులకే కట్టడి చేస్తే నెట్‌ర‌న్ రేట్ ఆధారంగా ద‌క్షిణాఫ్రికా జట్టుకు సెమిస్‌ (Semis)లోకి వెళ్లేది. ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రెండు జట్లు విజయం కోసం పోరాడాయి.

    దక్షిణాఫ్రికా బౌలర్ రబాడా చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి హ్యా ట్రిక్ తీయడం తో దక్షిణాఫ్రికా గెలిచింది. ద‌క్షిణాఫ్రికా సెమిస్ రేసులోంచి త‌ప్పుకొన్నా.. ర‌బాడా బోలింగ్ మ్యాచ్‌కు హైలెట్‌ (Highlight)గా నిలిచింది.

    టాస్ ఓడిపోయి బ్యాటింగ్ (Batting) కు దిగిన ద‌క్షిణాఫ్రికా ఇంగ్లండ్ ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. తొలుత టాస్ (Toss) ఓడి బ్యాటింగ్‌కు దిగిన ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు దూకుడు చూపించారు.

    Eng Vs Sa : మ్యాచ్ గెలిచినా సౌతాఫ్రికాకు నిరాశే.. సెమీస్ కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు..







    ఓపెన‌ర్ రీజా హెండ్రిక్స్ (2) విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ.. మ‌రో ఓపెన‌ర్ క్వింట‌న్‌ డికాక్ (34) ఆక‌ట్టుకున్నాడు. ఇక హెండ్రిక్స్ ఔట్ కావ‌డంతో బ్యాటింగ్‌కు దిగిన వాన్ డర్ డ‌స్సేన్ (94) చెల‌రేగాడు. ఆరు సిక్సులు, ఐదు ఫోర్ల‌తో భారీ స్కోర్‌ను సాధించాడు. డికాక్ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన మార్‌క్ర‌మ్ (52)తో హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 189 ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్ కు మాత్రమే చెరో వికెట్ దక్కింది. నువ్వానేనా అనే రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా గెలిచినా ఓడిన‌ట్టే అయ్యింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: England, South Africa, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు