Jonny Bairstow : ఈ ఏడాది ఇంగ్లండ్ (England) బ్యాటర్ జానీ బెయిర్ స్టో (Jonny Bairstow) సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలోనూ కలిపి ఇప్పటి వరకు ఈ ఏడాదిలో అతడు 2,200 పరుగులు చేసి.. 2022లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు. తాజాగా సౌతాఫ్రికా ()తో జరిగిన తొలి టి20లో కూడా 53 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే బెయిర్ స్టోకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. జిమ్ లో బెయిర్ స్టో బాహుబలిలా మారిపోయి సహచర ప్లేయర్ ను ఈజీగా ఎత్తేశాడు.
ఒక జిమ్ లో బెయిర్ స్టో సహచర ప్లేయర్ స్యామ్ కరణ్ ను తన భుజాలపై మోస్తూ.. మధ్యలో ఒకసారి మోకాలిపై కూర్చొని మళ్లీ నిల్చున్నాడు. ఆ తర్వాత స్యామ్ కరణ్ ను అలానే మోస్తూ ముందుకు వచ్చేశాడు. ఈ వీడియోను చూసిన అతడి ఫ్యాన్స్ బెయిర్ స్టోను మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్ బ్యాటింగ్ ను బెయిర్ స్టో ఒక్కడే మోస్తున్నాడంటూ ట్వీట్ పెడుతున్నారు.
Jonny Bairstow lifting Sam Curran ????????????
???? IG: reecejtopley pic.twitter.com/HwVH7l6wVr
— England’s Barmy Army (@TheBarmyArmy) July 26, 2022
ఇక సౌతాఫ్రికాతో ఆరంభమైన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 234 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో 53 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ ను తలదన్నేలా మొయిన్ అలీ కేవలం 18 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.
ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. దాంతో అంతర్జాతీయ టి20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. జానీ బెయిర్ స్టో, మొయిన్ అలీ జంట కేవలం 35 బంతుల్లోనే 106 పరుగులు జోడించడం విశేషం. అయితే వీరి భాగస్వామ్యాన్ని లుంగీ ఎంగిడి విడదీశాడు. చివరి ఓవర్ ఐదో బంతికి బెయిర్ స్టో కూడా పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక ఛేదనలో సౌతాఫ్రికా ఫర్వాలేదనిపించింది. లక్ష్యం భారీగా ఉండటంతో చివరి వరకు విజయం కోసం పోరాడింది. ట్రిస్టాన్ స్టుబ్స్ 28 బంతుల్లో 72 పరుగులు చేశాడు. 2 ఫోర్లు బాదిన అతడు 8 సిక్సర్లు కొట్టాడు. ట్రిస్టాన్ అవుటవ్వడంతో సౌతాఫ్రికా ఓటమి ఖాయమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, England, India Vs Westindies, London, South Africa, Team India