ENG vs PAK : పాకిస్తాన్ (Pakistan) గడ్డపై క్రికెట్ సిరీస్ ల జోరు అందుకుంది. మొన్నటి వరకు పాకిస్తాన్ లో క్రికెట్ ఆడాలంటే భయపడిన దేశాలు ఇప్పుడు అక్కడ మ్యాచ్ లు ఆడేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. జింబాబ్వే (Zimbabwe), వెస్టిండీస్ (West Indies), బంగ్లాదేశ్ (Bangladesh) లాంటి చిన్న జట్లు పాకిస్తాన్ గడ్డపై మొన్నటి వరకు సిరీస్ లు ఆడాయి. ఇక ఈ ఏడాది మాత్రం ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England) లాంటి జట్లు పాక్ లో సిరీస్ లు ఆడాయి. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ తో ఆసీస్ టెస్టు సిరీస్ ఆడింది. ఇక టి20 ప్రపంచకప్ కు ముందు పాక్ వేదికగా 7 మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇంగ్లండ్ పాల్గొంది. తాజాగా మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు ఆదివారం తెల్లవారుజామున పాక్ గడ్డపై అడుగుపెట్టింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత పాక్లో టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ రావడం విశేషం. చివరగా 2005లో పాకిస్తాన్లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆడింది.
ఇది కూడా చదవండి : పాపం.. సంజూ సామ్సన్! జట్టులో చోటు దక్కలేదని ఏం చేశాడో తెలుసా?
పాక్ తో జరిగే టెస్టు సిరీస్ కోసం ఆ దేశంలో ఇంగ్లండ్ ల్యాండ్ అయిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ లో పెట్టింది. ‘పాకిస్తాన్ లో అడుగుపెట్టాం’ అనే క్యాప్షన్ ను ఆ వీడియోకు జత చేసింది. వాస్తవానికి గతేడాదే పాకిస్తాన్ లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే న్యూజిలాండ్ సెక్యూరిటీ సంబంధిత కారణాలతో తమ సిరీస్ ను రద్దు చేసుకుంది. అప్పుడు మ్యాచ్ రోజు న్యూజిలాండ్ ప్లేయర్లు గ్రౌండ్ కు చేరుకోకుండా హోటల్ గదులకే పరిమితం అవుతారు. సెక్యూరిటీ విషయంలో తమకు హెచ్చరికలు వచ్చేశాయని న్యూజిలాండ్ అప్పుడు పేర్కొంది. వెంటనే తమ పర్యటనను రద్దు చేసుకుని పాక్ ను విడిచింది. దాంతో ఇంగ్లండ్ తన పర్యటనను వాయిదా వేసుకుంది.
Touchdown in Pakistan for our Men’s Test squad! ???????? pic.twitter.com/2GbRr1Xcw1
— England Cricket (@englandcricket) November 26, 2022
డిసెంబర్ 1 నుంచి రావల్పిండిలో తొలి టెస్టు జరగనుంది. ఆ తర్వాత ముల్తాన్ వేదికగా(డిసెంబర్ 9 నుంచి 13 వరకు) రెండో టెస్టు, కరాచీ వేదికగా డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడో టెస్టు జరగనుంది. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉంది. ఈ సిరీస్లో విజేతగా నిలిచిన జట్టు టాప్-4కు చేరుకునే అవకాశం ఉంది. బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, England, Pakistan