హోమ్ /వార్తలు /క్రీడలు /

ENG vs PAK : పాకిస్తాన్ లో ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫుడ్ పాయిజన్! 15 మందిలో 14 మందికి అస్వస్థత.. కెప్టెన్ కూడా

ENG vs PAK : పాకిస్తాన్ లో ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫుడ్ పాయిజన్! 15 మందిలో 14 మందికి అస్వస్థత.. కెప్టెన్ కూడా

PC : England Cricket

PC : England Cricket

ENG vs PAK : మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ (Pakistan)లో ఇంగ్లండ్ (England) అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టు రావల్పిండి వేదికగా డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు జరగాల్సి ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ENG vs PAK : మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ (Pakistan)లో ఇంగ్లండ్ (England) అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టు రావల్పిండి వేదికగా డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే ఈ టెస్టు మ్యాచ్ జరిగేది ఇప్పుడు అనుమానంగా మారింది. ఉన్నట్టుండి ఇంగ్లండ్ ప్లేయర్లకు తీవ్ర అస్వస్థత అయినట్లు వార్తలు వస్తున్నాయి. కొందరేమో ఫుడ్ పాయిజన్ అని.. మరికొందరేమో ఫ్లూ లాంటి వైరస్ బారిన పడ్డట్లు పేర్కొంటున్నారు. 15 మంది సభ్యులతో ఇంగ్లండ్ పాక్ లో అడుగుపెట్టింది. వీరిలో దాదాపు 14 మంది అనారోగ్యం బారిన పడ్డట్లు తెలుస్తోంది. వీరందరూ తమ హోటల్ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. మ్యాచ్ కు 24 గంటలకు కంటే కూడా తక్కువ సమయం ఉండటంతో తొలి టెస్టు జరిగేది అనుమానంగా మారింది.

ఇక బుధవారం నాడు పాకిస్తాన్ లోని క్వెట్టా ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. మానవబాంబుగా మారిన ఒక ఉగ్రవాది పోలీస్ వాహనం ముందు తనను తాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో ఉగ్రవాదితో సహా ముగ్గురు చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డట్లు తెలుస్తుంది. ఈ దాడిని తామే చేసినట్లు తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్తాన్‌ ప్రకటించుకుంది. రాబోయే రోజుల్లో దేశంలో మరిన్ని చోట్లు బాంబు దాడులకు పాల్పడతామని కూడా హెచ్చరించింది. పాక్ తో టెస్టు సిరీస్ కు ముందు ఇదంతా జరగడంతో ఇంగ్లండ్ జట్టులో భయాందోళనలు నెలకొన్నట్లు కూడా సమాచారం. దాంతో ఇంగ్లండ్, పాక్ సిరీస్ జరిగేది అనుమానంగా మారింది.

చివరిసారిగా ఇంగ్లండ్ 2005లో పాకిస్తాన్ లో టెస్టు సిరీస్ ను ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఆ దేశంలో కాలు పెట్టలేదు. ఇక టి20 ప్రపంచకప్ కు ముందు 7 మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం పాక్ లో ఇంగ్లండ్ అడుగుపెట్టింది. ఇక 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడ ల్యాండ్ అయ్యింది. అయితే అంతలోనే ఇలా జరగడంతో పాకిస్తాన్ లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆడేది అనుమానంగా మారింది. గతేడాది పాకిస్తాన్ లో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే సెక్యూరిటీ కారణాలతో తమ పర్యటనను రద్దు చేసుకుని పాక్ ను విడిచింది. దాంతో ఇంగ్లండ్ తన పర్యటనను వాయిదా వేసుకుంది.

First published:

Tags: Babar Azam, England, Pakistan

ఉత్తమ కథలు