హోమ్ /వార్తలు /క్రీడలు /

ENG vs PAK : ముందు క్యాచ్ లు ఎలా పట్టాలో నేర్చుకో.. హీరోలా ఫీలయ్యే కమేడియన్ నువ్వు బాబర్

ENG vs PAK : ముందు క్యాచ్ లు ఎలా పట్టాలో నేర్చుకో.. హీరోలా ఫీలయ్యే కమేడియన్ నువ్వు బాబర్

Babar Azam

Babar Azam

ENG vs PAK : పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ జట్టుకు ఘోర అవమానం. అది కూడా సొంత ప్రేక్షకుల మధ్య. ఇంగ్లండ్ (England)తో జరిగిన ఏడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో పాకిస్తాన్ ఖంగుతింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ENG vs PAK : పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ జట్టుకు ఘోర అవమానం. అది కూడా సొంత ప్రేక్షకుల మధ్య. ఇంగ్లండ్ (England)తో జరిగిన ఏడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో పాకిస్తాన్ ఖంగుతింది. సిరీస్ విజేతను తేల్చే చివరిదైన ఏడో టి20లో పాకిస్తాన్ 67 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. తద్వారా ఇంగ్లండ్ 4-3 తేడాతో పాకిస్తాన్ పై జయభేరి మోగించింది. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు జాస్ బట్లర్, బెన్ స్టోక్స్ లు ఈ సిరీస్ కు దూరంగా ఉన్నా.. కీలక బౌలర్లు మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ ఆఖరి టి20కి దూరమైనా అది ఇంగ్లండ్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. లాహోర్ వేదికగా జరిగిన చివరి టి20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది.

ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన మిస్ ఫీల్డింగ్ తో వినోదాన్ని పంచాడు. రెండు సునాయాస క్యాచ్ లను మిస్ చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. హ్యారీ బ్రూక్ ఇచ్చిన రెండు సునాయాస క్యాచ్ లను జారవిడిచాడు.  ఇఫ్తికర్ వేసిన 12 ఓవర్‌ ఐదో బంతికి ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను  బాబర్ అందుకోలేకపోయాడు. అప్పుడు బ్రూక్ కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్ లో బ్రూక్ ఇచ్చిన మరో క్యాచ్ ను బాబర్ ఆజమ్ నేలపాలు చేశాడు. రెండు సార్లు లైఫ్ దొరకడంతో ఆఖర్లో బ్రూక్ రెచ్చిపోయాడు. 29 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. డేవిడ్ మలాన్ 47 బంతుల్లో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక దీనిపై ట్విట్టర్ వేదికగా జోక్స్ పేలుతున్నాయి. డోనట్ బాబర్ ఆజమ్ కంటే కూడా బెటర్ ఫీల్డర్ అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. ఇంగ్లండ్ ‘సి’ టీంతో పాకిస్తాన్ ఓడిపోయిందంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

అనంతరం ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఆరంభంలోనే ఇన్ ఫామ్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (1), బాబర్ ఆజమ్ (4) వికెట్లను కోల్పోయింది. షాన్ మసూద్ (56) అర్ధ సెంచరీ చేసినా మరీ నెమ్మదిగా ఆడాడు. కుష్దిల్ షా (27) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ మినహా మిగిలిన ప్లేయర్లు విఫలం అయ్యారు. దాంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Babar Azam, England, India vs South Africa, Pakistan, Team India