హోమ్ /వార్తలు /క్రీడలు /

ENG vs PAK : ‘బి’ టీంతో పాకిస్తాన్ ను ఉతికారేసిన ఇంగ్లండ్.. భారీ తేడాతో ఘనవిజయం

ENG vs PAK : ‘బి’ టీంతో పాకిస్తాన్ ను ఉతికారేసిన ఇంగ్లండ్.. భారీ తేడాతో ఘనవిజయం

PC : TWITTER

PC : TWITTER

ENG vs PAK 3rd T20: సొంత దేశంలో పాకిస్తాన్ (Pakistan)కు ఇంగ్లండ్ (England) చేతిలో చావు దెబ్బ తింది. సీనియర్లు లేకుండానే పాకిస్తాన్ తో సిరీస్ కు సిద్దమైన ఇంగ్లండ్ అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ENG vs PAK 3rd T20: సొంత దేశంలో పాకిస్తాన్ (Pakistan)కు ఇంగ్లండ్ (England) చేతిలో చావు దెబ్బ తింది. సీనియర్లు లేకుండానే పాకిస్తాన్ తో సిరీస్ కు సిద్దమైన ఇంగ్లండ్ అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది. కరాచీ వేదికగా జరిగిన మూడో టి20లో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ 63  పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరును సాధించింది. హ్యారీ బ్రూక్  (35 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), బెన్ డకెట్ (42 బంతుల్లో 70 నాటౌట్) ఇంగ్లండ్ భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. వీరి దెబ్బకి పాక్ బౌలర్ దహానీ 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 62 పరుగులు సమర్పించుకున్నాడు. విల్ జాక్ (40) రాణించాడు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ ఖాదిర్ 2 వికెట్లు తీశాడు.

ఇది కూడా చదవండి : ‘స్పోర్ట్స్ లో ఇదే బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ పిక్’ రోజర్, నడాల్ పై కోహ్లీ ట్వీట్

అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసింది. మార్క్ వుడ్ 3 వికెట్లు తీస్తే.. ఆదిల్ రషీద్ 2 వికెట్లతో పాకిస్తాన్ పనిపట్టారు. షాన్ మసూద్ (65) అర్ధ సెంచరీతో రాణించాడు. గత మ్యాచ్ లో సెంచరీ కొట్టిన కెప్టెన్ బాబర్ ఆజమ్ (8)తో పాటు రిజ్వాన్ (8) త్వరగా పెవిలియన్ కు చేరారు.ఒక దశలో పాక్ 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే మసూద్ పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

7 మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికి మూడు మ్యాచ్ లు పూర్తి కాగా ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. మొదటి టి20లో ఇంగ్లండ్ విజయం సాధిస్తే.. రెండో టి20 పాకిస్తాన్ గెలిచింది. ఇక మూడో టి20లో మళ్లీ ఇంగ్లండ్ విజయం సాధించింది. నాలుగో టి20 ఇదే గ్రౌండ్ లో ఆదివారం జరగనుంది.

సీనియర్లు లేకపోయినా

గాయంతో బెయిర్ స్టోతో పాటు బెన్ స్టోక్స్ లాంటి కీలక ప్లేయర్లు లేకుండానే ఇంగ్లండ్ పాకిస్తాన్ తో సిరీస్ కోసం ఆ దేశంలో అడుగుపెట్టింది. వాస్తవానికి బట్లర్ కెప్టెన్ గా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో అతడు గాయం బారిన పడ్డాడు. టి20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యల్లో అతడిని ఇంగ్లండ్ మేనేజ్ మెంట్ ఆడించడం లేదు. అయినప్పటికీ పూర్తి స్థాయితో బరిలోకి దిగిన పాకిస్తాన్ కు వారి దేశంలోనే గట్టి పోటీ ఇస్తుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Babar Azam, Dinesh Karthik, India vs australia, Pakistan, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు