PAK vs ENG 1st Test : పాకిస్తాన్ (Pakistan) పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ (England) స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) చిత్ర విచిత్ర వేశాలు వేస్తున్నాడు. విచిత్ర చేష్టలకు కేరాఫ్ అడ్రస్ గా జో రూట్ ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం టెస్టు మ్యాచ్ ఆడుతూ నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న సమయంలో బ్యాట్ ను పిచ్ పై ఎటువంటి ఆధారం లేకుండా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. జో రూట్ లానే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా పిచ్ పై బ్యాట్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లోనూ జో రూట్ విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడు.
పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సహచరుడు జాక్ క్రాలీ తలపై బంతిని రుద్దాడు. ఇది కాస్తా కెమెరాల్లో రికార్డు కాగా.. బాల్ ట్యాంపరింగ్ కు జో రూట్ పాల్పడ్డాడు అంటూ కొందరు కామెంట్స్ కూడా చేశారు. ఇక తాజాగా ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో జో రూట్ బ్యాటింగ్ శైలి హాట్ టాపిక్ గా మారింది. జో రూట్ స్వతహాగా రైట్ హ్యాండ్ బ్యాటర్. అయితే పాక్ లెగ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఎవరూ ఊహించని విధానాన్ని ఎంచుకున్నాడు. స్వతహాగా రైట్ హ్యాండర్ అయిన అతను.. సడెన్గా మహూమూద్ బౌలింగ్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అవతారం ఎత్తాడు. మహమూద్ వేసిన బంతిని స్వీప్ చేసి సింగిల్ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Joe Root as a left-handed batter. pic.twitter.com/d1AkdmFkmA
— Johns. (@CricCrazyJohns) December 4, 2022
What’s happening? Great question twitter. It’s just Joe Root batting left handed hahahahahahhaa. I love this team!! #ENGvPAK ???????? ???????????????????????????? pic.twitter.com/L4LQA0kTYU
— Alexandra Hartley (@AlexHartley93) December 4, 2022
అయితే ఆ ఓవర్ ను పూర్తిగా లెఫ్టాండర్ గా ఆడాడా? అంటే అది కాదు. ఒక్క బంతిని ఆడిన అతడు ఆ తర్వాత మళ్లీ రైట్ హ్యాండర్ గా ఆడాడు. మధ్య మధ్యలో రివర్స్ స్వీప్ ప్రయత్నాలు చేశాడు. ప్రస్తుతం తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే పాక్ 227 పరుగులు చేయాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 7 వికెట్లు తీయాల్సి ఉంది. సోమవారం ఆటకు చివరి రోజు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, England, Pakistan