Home /News /sports /

ENG VS NZ CORONA TENSION IN NEW ZEALAND TEAM ANOTHER STAR PLAYER DEVON CONWAY TESTED COVID 19 POSITIVE SRD

ENG vs NZ : ఓ వైపు ఓటములు.. మరోవైపు గాయాలు.. ఇప్పుడు కరోనా.. న్యూజిలాండ్ కు షాకుల మీద షాకులు..

Devon Conway

Devon Conway

ENG vs NZ : రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఫలితంగా విలియమ్సన్ రెండో టెస్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో స్టార్ ఆటగాడు కరోనా బారిన పడ్డాడు.

    ఇంగ్లండ్ పర్యటనలో (England vs New Zealand) వరుస రెండు ఓటములతో ఢీలా పడ్డ న్యూజిలాండ్ జట్టును కరోనా (Corona) అల్లాడిస్తోంది. ఆ జట్టులోని స్టార్ ప్లేయర్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. రెండో టెస్టు చివరి రోజు ముగిసిన మరుసటి రోజు అయిన బుధవారం న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్ వేల్(Michael Bracewell) కరోనా బారిన పడ్డాడు. ఇటీవల నిర్వహించిన కరోనా టెస్ట్‌లో అతనికి పాజిటివ్ అని తేలింది. మైఖేల్ బ్రేస్‌వెల్ రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ జట్టు ప్లేయింగ్ 11లో ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మరో స్టార్ ప్లేయర్ కరోనా బారిన పడ్డాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే (Devon Conway)కు కరోనా పాజిటివ్ వచ్చింది. బుధవారం లండన్లో పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో అయిదు రోజుల పాటు అతను ఐసోలేషన్లో ఉండనున్నాడు. ఇక జూన్ 23 నుంచి 27వరకు హెడ్డింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడోది మరియు చివరి టెస్ట్‌కు అతను అందుబాటులోకి వస్తాడో, రాడో అనే డైలామా కొనసాగుతుంది.

    ఇక రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఫలితంగా విలియమ్సన్ రెండో టెస్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని గైర్హాజరీలో జట్టుకు టామ్ లాథమ్ కెప్టెన్సీ వహించాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ స్క్వాడ్‌లో కరోనా బారిన పడ్డ మూడో ఆటగాడు డేవాన్ కాన్వే. వీళ్లతో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌లో ఇద్దరు సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు.



    ఓ పక్క వరుస ఓటములు, మరో పక్క కోవిడ్‌ కేసులతో అల్లాడుతున్న కివీస్‌ జట్టును గాయాలు కూడా వేధిస్తున్నాయ్. ఫస్ట్ టెస్ట్ సందర్భంగా ఆల్‌రౌండర్‌ కొలిన్ గ్రాండ్‌హోమ్ గాయపడగా, అతనికి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన బ్రేస్‌వెల్‌ కరోనా బారిన పడ్డాడు.

    అలాగే రెండో టెస్ట్‌ సందర్భంగా మరో ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ కూడా గాయపడినట్టు సమాచారం. రెండో టెస్టు ఆఖరి రోజు బౌలింగ్ చేస్తూ జేమీసన్ గాయపడ్డాడని.. అతని గాయం చాలా తీవ్రమైందని సమాచారం. దీంతో జేమీసన్‌ కూడా మూడో టెస్ట్‌ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది.

    ఇది కూడా చదవండి : టీమిండియాలో కుర్చీలాట.. ఏడాదిలో ఏడుగురు సారథులు.. ఇలా అయితే కష్టమే బాసూ..!

    ఇక, రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో టీ20 ఇన్నింగ్స్ లాంటి సెంచరీతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. బెయిర్ స్టో 136 పరుగులు చేశాడు. దీంతో, మూడు మ్యాచుల టెస్టు సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది.బెయిర్ స్టో వీరబాదుడుకు తోడు కెప్టెన్ బెన్ స్టోక్స్ (75 నాటౌట్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్ జత కావడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Corona effect, Cricket, England vs newzealand, Kane Williamson

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు