Home /News /sports /

ENG VS NZ 3RD TEST MATCH NEW ZEALAND BATTER DARYL MITCHELL BREAKES MARTIN DONNELLY 73 YEAR OLD RECORD SJN

ENG vs NZ : ఈ కివీస్ కింగ్ ముందు అందరూ దిగదుడుపే.. దెబ్బకు 73 ఏళ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది

PC : TWITTER

PC : TWITTER

ENG vs NZ : ప్రస్తుతం న్యూజిలాండ్ (New Zealand) క్రికెట్ జట్టు ఇంగ్లండ్ (England)తో వారి దేశంలోనే మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా.. రెండింటిలోనూ ఇంగ్లండ్ జట్టే విజయం సాధించింది. దాంతో ఆఖరి టెస్టు మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇంగ్లండ్ టీం సిరీస్ ను సొంతం చేసుకుంది.

ఇంకా చదవండి ...
ENG vs NZ : ప్రస్తుతం న్యూజిలాండ్ (New Zealand) క్రికెట్ జట్టు ఇంగ్లండ్ (England)తో వారి దేశంలోనే మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా.. రెండింటిలోనూ ఇంగ్లండ్ జట్టే విజయం సాధించింది. దాంతో ఆఖరి టెస్టు మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇంగ్లండ్ టీం సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక పరువు దక్కించుకోవాలనే లక్ష్యంతో మూడో టెస్టు బరిలో కివీస్ జట్టు నిలిచింది. మూడో టెస్టు మూడు రోజుల ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ దే పైచేయిగా నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఫలితంగా 137 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (4 బ్యాటింగ్), బ్లండెల్ (5 బ్యాటింగ్) ఉన్నారు. వీరి ఆటపైనే కివీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఇది కూడా చదవండి : బాబు హార్దిక్.. నువ్వు మామూలోడివి కాదబ్బా.. ఏకంగా ఆ బాలీవుడ్ హీరోయిన్ నే..

ఇక ఈ సిరీస్ లో న్యూజిలాండ్ బ్యాటింగ్ దారుణంగా వైఫల్యం చెందింది. స్టార్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, విల్ యంగ్, కాన్వే, నికోల్స్ ఇలా అందరూ దారుణంగా విఫలమయ్యారు. ప్రతి మ్యాచ్ లోనూ కేవలం డారిల్ మిచెల్, బ్లండెల్ మాత్రమే ఆడుతూ వస్తున్నారు. ముఖ్యంగా డారిల్ మిచెల్ భీకర ఫామ్ లో ఉన్నాడు. ఈ సిరీస్ లో అతడు తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మినహా.. మిగతా నాలుగు ఇన్నింగ్స్ ల్లోనూ అద్భుతంగా ఆడాడు. ఈ సిరీస్ లో అతడి ఆరు ఇన్నింగ్స్ లలో పరుగులను చూస్తే వరుసగా.. 13, 108, 190, 62 నాటౌట్, 109, 4 నాటౌట్ గా ఉన్నాయి. ప్రస్తుతం మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మిచెల్ 4 పరుగులతో ఆడుతున్నాడు.



ఇప్పటి వరకు ఈ సిరీస్ లో ఆడిన 6 ఇన్నింగ్స్ లలో కలిపి మొత్తం 486 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మిచెల్ 73 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ పై ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా మిచెల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు మార్టిన్ డానెల్లీ పేరిట ఉండేది. 1949లో మార్టిన్ ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో పై 472 పరుగులు చేశాడు. తాజాగా ఆ రికార్డును డారిల్ బద్దలు కొట్టేశాడు. ఇంత భీకర ఫామ్ లో ఉన్నా కూడా తన జట్టును గెలిపించుకోవడంలో డారిల్ మిచెల్ విఫలం అవుతున్నాడు. ఇతర కివీస్ ప్లేయర్ల నుంచి సహాయం అందకపోవడంతో మిచెల్ పోరాటం వృధాగా మిగులుంది. త్వరలో ప్రకటించే టెస్టు ర్యాంకింగ్స్ లో మిచెల్ ర్యాంకు గణనీయంగా మెరుగుపడటం ఖాయం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, England vs newzealand, India vs england, Kane Williamson, New Zealand, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు