Home /News /sports /

ENG VS NED ODI SERIES NETHERLANDS PLAYERS SEARCH FOR THE BALL IN BUSHES AFTER DAWID MALANS BIG SIX WATCH HILARIOUS VIDEO SJN

ENG vs NED : పల్లెటూరి క్రికెట్ లా అంతర్జాతీయ మ్యాచ్.. బాల్ కోసం చెట్లు, పుట్టల్లో వెతికిన ప్లేయర్స్

PC : TWITTER

PC : TWITTER

ENG vs NED : మనలో చాలా మంది చిన్నతనంలో పల్లెల్లో క్రికెట్ ఆడే ఉంటాం. మనం కొట్టిన బంతి పొదల్లోకో లేదా గడ్డివాముల్లోకో వెళ్లే ఉంటుంది. అప్పుడు మనం ఆ బాల్ కోసం గంటలు తరబడి వెతికే ఉంటాం. బంతి దొరకగానే అదేదో గోల్డ్ మెడల్ సాధించినట్లు కేరింతలు కొడుతూ మళ్లీ ఆటలోకి దిగుతాం.

ఇంకా చదవండి ...
ENG vs NED : మనలో చాలా మంది చిన్నతనంలో పల్లెల్లో క్రికెట్ ఆడే ఉంటాం. మనం కొట్టిన బంతి పొదల్లోకో లేదా గడ్డివాముల్లోకో వెళ్లే ఉంటుంది. అప్పుడు మనం ఆ బాల్ కోసం గంటలు తరబడి వెతికే ఉంటాం. బంతి దొరకగానే అదేదో గోల్డ్ మెడల్ సాధించినట్లు కేరింతలు కొడుతూ మళ్లీ ఆటలోకి దిగుతాం. మన దగ్గర ఒకే బాల్ ఉంటుంది కాబట్టి మనం అలా చేసి ఉంటాం. కానీ, ఒక అంతర్జాతీయ క్రికెట్ లో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంగ్లండ్ (England), నెదర్లాండ్స్ (Netherlands) జట్ల మధ్య మూడు మ్యాచ్ వన్డే సిరీస్ ఆరంభమైంది. అందులో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరిగింది.

ఇది కూడా చదవండి : మీరు పులులు కాదు.. పిల్లులు.. పరమ చెత్త రికార్డును సొంతం చేసుకున్న నాగినీ టీం

తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వారి బ్యాటింగ్ కు బంతులన్నీ స్టేడియం అవతల ఉన్న చెట్ల పోదల్లోకి వెళ్లిపోయాయి. దీంతో డచ్‌ ఆటగాళ్లు పదే పదే పొదల్లోకి దూరి బంతి కోసం వెతుకులాట చేయడం ఆసక్తిగా మారింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ మధ్యలో డేవిడ్‌ మలాన్.. నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ పీటర్‌ సీలర్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. ఆ బంతి వెళ్లి స్టేడియం అవతల ఉన్న చెట్ల పొదల్లో పడింది. బంతిని వెతకడానికి నెదర్లాండ్స్‌ జట్టులో దాదాపు సగం మంది సభ్యులు చెట్లు, పుట్టల్లో‍కి వెళ్లాల్సి వచ్చింది. అంతమంది ఒకేసారి వెతికితే గానీ రెండు నిమిషాలకు బంతి కనిపించడం విశేషం. బంతి దొరకగానే చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ ప్లేయర్లలో ముగ్గురు సెంచరీలు చేయడం విశేషం. ఫిల్ సాల్ట్ (122), డేవిడ్ మలాన్ (125)లతో పాటు రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ (162 నాటౌట్) శతకాలతో వీరవిహారం చేశారు. వీరి దెబ్బకు నెదర్లాండ్స్ బౌలర్లలో ఒకరు సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ముగ్గురు సెంచరీకి చేరువగా వచ్చి ఆగిపోయారు. అయితే జేసన్ రాయ్ (1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0) విఫలం కావడం విశేషం. చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ (66 నాటౌట్) కూడా రెచ్చిపోయాడు. అనంతరం కష్టసాధ్యమైన ఛేజింగ్ మొదలు పెట్టిన డచ్ టీం 49.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ 232 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (72), మ్యాక్స్ (55) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ మూడు వికెట్లు తీశాడు
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, Dinesh Karthik, England, England vs newzealand, India vs South Africa, South Africa, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు