Viral: ఇదేమీ చెత్త బ్యాటింగ్..బాత్రూమ్ లో ఏమైనా పని ఉందా ఏంటీ..? మరీ 7 పరుగులకే ఆలౌటా..

ప్రతీకాత్మక చిత్రం

Viral: ఏడు పరుగులకే ఆలౌట్ అవడం అంటే వింతగానే ఉంటుంది. కానీ, ఇది నిజంగా జరిగింది. క్రికెట్ చరిత్రలో ఇటువంటి చెత్త రికార్డును ఇప్పటివరకు ఎవరూ క్రియేట్ చేసి ఉండకపోవచ్చు. ఇంగ్లండ్ లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో మాత్రం ఇదే జరిగింది.

  • Share this:
    ఒక ఆటగాడు ఒక మ్యాచ్‌లో 20 నుంచి 25 పరుగులు చేస్తే అతడు విఫలమయ్యాడు అంటారు. కానీ ఒక మ్యాచ్‌లో పదకొండు మంది ఆటగాళ్లు కలిసి కేవలం 7 పరుగులు మాత్రమే చేస్తే ఏమంటారు.. అవును ఇది నిజం. అందులో కూడా రెండు ఎక్స్ ట్రాలు. వివరాల్లోకెళితే.. యార్క్‌షైర్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి. ఈస్ట్‌రింగ్‌స్టన్‌ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో.. హిల్లమ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది. అనంతరం స్వల్ప ఛేదనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 8 బంతుల్లోనే వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయిన మ్యాచ్‌గా చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లు కేవలం 56 బంతుల్లోనే ముగిసిపోయాయి.

    తొలుత బ్యాటింగ్‌కు దిగిన హిల్లమ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏదో పని ఉందన్నట్లుగా క్రీజులోకి వచ్చీరాగానే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు చేరారు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10మంది బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ చేయగా, 8 మంది ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. మిగిలిప ఇద్దరు ఆటగాళ్లు అతికష్టం మీద తలో రెండు పరుగులు చేయగా, మిగిలిన మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో ఫ్రైస్టన్‌ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్ధి బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.
    ఆ తర్వాత 8 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌రింగ్‌స్టన్‌ జట్టు.. కేవలం 1.2 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా టార్గెట్‌ను రీచ్‌ కావడంతో ఏ ఫార్మాట్టోనైనా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌గా ఈ మ్యాచ్‌ చరిత్రకెక్కింది. ఈస్ట్‌రింగ్‌స్టన్‌ ఆటగాడు జేమ్స్ ఒక్కడే 8 బంతులను ఎదుర్కొని బౌండరీ సాయంతో 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్‌ట్రాగా లభించింది. మరోవైపు ఈ మ్యాచ్ పై క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. మీ కన్నా గల్లీ క్రికెటర్లు నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు.. బాత్రూమ్ లో ఏమైనా పని ఉందా.. అందుకే అందరి వరుస కట్టి పెవిలియన్ కు క్యూ కట్టారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: