Home /News /sports /

ECB ANNOUNCED 15 MEMBER SQUAD FOR RESCHEDULE 5TH TEST AGAINST INDIA SJN

IND vs ENG : నక్కతోక తొక్కిన కేకేఆర్ ప్లేయర్.. ఇండియాతో జరిగే టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్ టీంలో స్థానం

PC : ICC

PC : ICC

IND vs ENG : జూలై 1 నుంచి భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య రీడ్యూల్ టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భారత జట్టు ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టి.. లీసెస్టర్ షైర్ తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ను కూడా ఆడింది.

ఇంకా చదవండి ...
IND vs ENG : జూలై 1 నుంచి భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య రీడ్యూల్ టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భారత జట్టు ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టి.. లీసెస్టర్ షైర్ తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ను కూడా ఆడింది. ఇక నిన్నటి వరకు న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడిన ఇంగ్లండ్ భారత్ తో జరిగే మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత్ తో జరిగే మ్యాచ్ కోసం 15 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది. బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ కు సారథిగా వ్యవహరించనున్నాడు.

ఇది కూడా చదవండి : ఒక్క టైటిల్ కొట్టేసరికి రోహిత్ మీకు కానివాడయ్యాడా.? అలా అంటే రోహిత్ ఖాతాలో ఐదు టైటిల్స్ ఉన్నాయి మరీ..

ఇక న్యూజిలాండ్ తో జరిగిన చివరి టెస్టు మూడో రోజు ఆటలో కరోనా బారిన పడ్డ ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్ ను ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేయడం విశేషం. ప్రస్తుతం అతడు క్వారంటైన్ లో ఉన్నాడు. మ్యాచ్ నాటికి అతడు కోలుకునేది కష్టంగానే కనిపిస్తోంది. దాంతో అతడికి బ్యాకప్ గా కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్ స్యామ్ బిల్లింగ్స్ ను ఈసీబీ ఎంపిక చేసింది. ఫోక్స్ కోలుకోకపోత అతడి స్థానంలో బిల్లింగ్స్ వికెట్ కీపర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. అతడికి తోడు జానీ బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ కు మరో వికెట్ కీపర్ ఆప్షన్ ఉంది.

భారత్ తో జరిగే టెస్టు మ్యాచ్ కు ముందు కివీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఇంగ్లండ్ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరు సెంచరీలతో కదం తొక్కి ఇంగ్లండ్ సిరీస్ ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక బౌలింగ్ విభాగంలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్ మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. జాక్ లీచ్ స్పిన్నర్ గా సేవలందించే అవకాశం ఉంది. కివీస్ తో జరిగిన చివరి రెండు టెస్టుల్లోనూ జానీ బెయిర్ స్టో టి20 తరహా ఆటతీరుతో రెచ్చిపోయాడు. భారత్ పై కూడా అతడు చెలరేగే అవకాశం ఉంది.



ఇంగ్లండ్ టెస్టు జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), ఆలీ పోప్, జో రూట్, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్‌టన్, జామీ ఓవర్‌టన్, మాథ్యూ పాట్స్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, India vs england, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు