హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : బ్యాడ్మింటన్ ప్లేయర్లకు సులువైన డ్రా.. క్వార్టర్స్ నుంచి కఠినమైన ప్రత్యర్థులు

Tokyo Olympics : బ్యాడ్మింటన్ ప్లేయర్లకు సులువైన డ్రా.. క్వార్టర్స్ నుంచి కఠినమైన ప్రత్యర్థులు

పీవీ సింధు

పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుండగా బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ డ్రాను ప్రకటించింది. భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు ప్రీ క్వార్టర్స్‌కు సులభంగానే చేరుకుంటుందని అనుకుంటుండగా.. ఆ తర్వాత బలమైన ప్రత్యర్థులతో ఢి కొట్టాల్సి ఉంది.

ఇంకా చదవండి ...

  టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి, ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) (BWF) ఒలింపిక్స్ డ్రాను ప్రకటించింది. భారత్ తరపున పతకాలు సాధిస్తారని ఆశలు పెట్టుకున్న వారిలో బ్యాడ్మింటన్ ప్లేయర్లు (Badminton Players) ముందు వరుసలో ఉన్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) ఈ సారి తప్పకుండా స్వర్ణం సాధించాలనే పట్టు దలతో ఉన్నది. సింధుకు మహిళల సింగిల్స్ 'జే' గ్రూప్‌లో పోటీ పడనున్నది. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా సింధు 34వ ర్యాంకర్ ఎన్‌గాన్, 58వ ర్యాంకర్ పోలకార్పోవ్‌లు ఉన్నారు. సింధుకు 6వ సీడ్ కేటాయించారు. కాగా గ్రూప్‌లో టాప్ ప్లేయర్ మాత్రమే నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు. పీవీ సింధు ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన అకానే యమగుచితో తలపడాల్సి ఉంటుంది. ఈమె బలమైన ప్రత్యర్థి కావడంతో సింధు చాలా కష్టపడాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో సింధు.. యమగుచిని ఓడిచింది. ఆమెను దాటినా క్వార్టర్ ఫైనల్ లేదా సెమీస్‌లో చైనా ప్లేయర్లు సింధుకు గట్టి పోటీ ఇవ్వనున్నారు.

  ఇక పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ పురుషుల సింగిల్స్ గ్రూప్ 'డి'లో ఉన్నాడు. అతడి గ్రూప్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ కాల్జో, జిల్బర్ మన్ ఉన్నారు. వీరిద్దరిని అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. అతడు కాస్త కష్టపడితే క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంటాడని నిపుణులు చెబుతున్నారు.

  Euro cup 2020 : ఫైనల్ చూడాలంటే టికెట్ ధర ఎంతో తెలుసా? బ్లాక్ మార్కెట్‌లో అర కోటి పలుకుతున్న టికెట్లు

  ఇక పురుషుల డబుల్స్ విభాగంలో ఆడుతున్న భారత జోడి సాత్వీత్-చిరాగ్ తమ గ్రూప్‌లో వరల్డ్ నెంబర్ 3 జోడి యాంగ్-వాంగ్ చీ, ఇంగ్లాండ్ జోడి లేన్-సీన్ వెన్‌డీతో తలపడాల్సి ఉన్నది. ఇది బలమైన గ్రూప్ కావడంతో భారత జోడీ కనీసం క్వార్టర్స్‌కు అయినా చేరతారా అనేది అనుమానంగా మారింది. అయితే డబుల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జోడీలు క్వార్టర్స్ చేరుతాయి. కానీ తిరిగి ఇతర గ్రూప్‌లోని రన్నర్ లేదా విన్నర్‌తో క్వార్టర్ ఆడాల్సి ఉన్నది. అందుకే భారత జోడీ కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కోవల్సి వస్తున్నది. ఏదేమైనా మొత్తానికి పీవీ సింధు తప్ప మిగతా వారికి బలమైన ప్రత్యర్థులు ఎదురు పడినప్పుడు పోటీ ఇవ్వగలుగుతారా లేదా అనేది అనుమానమే. అంతర్జాతీయ వేదికల్లో మిగతా ప్లేయర్లు గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లల కేవలం పీవీ సింధు పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.

  Published by:John Kora
  First published:

  Tags: Badminton, Pv sindhu, Tokyo Olympics

  ఉత్తమ కథలు