ధనాధన్ లీగ్ ఐపీఎల్ (IPL)కి మరో లెజెండ్ వీడ్కోలు పలికాడు. ఇటీవలే విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ (Kieron Pollard) ఈ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు సహచరుడు పొలార్డ్ బాటలోనే మరో విండీస్ వీరుడు డ్వేన్ బ్రావో (Dwayne Bravo) ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వచ్చే ఏడాది నుంచి ముంబై జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పొలార్డ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇప్పటి వరకూ తాను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించాడు. బ్రావోను బౌలింగ్ కోచ్‌గా నియమించిన విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది.
వ్యక్తిగత కారణాలతో లక్ష్మీపతి బాలాజీ ఏడాదిపాటు కోచింగ్‌కు దూరంగా ఉండనుండటంతో.. అతడి స్థానంలో బ్రావో తమ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని సూపర్ కింగ్స్ తెలిపింది. సూపర్ కింగ్స్ అకాడమీకి బాలాజీ సేవలు అందుబాటులో ఉంటాయని సీఎస్కే స్పష్టం చేసింది.
The streets will never forget...????#ChampionForever ???? pic.twitter.com/am3oTQu7Ce
— Chennai Super Kings (@ChennaiIPL) December 2, 2022
ముంబై ఇండియన్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డ్వేన్ బ్రావో.. ఆ తర్వాత 2011లో చెన్నైతో కలిశాడు. అప్పటి నుంచి చెన్నై తరఫున అద్భుతంగా రాణిస్తూ 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడాడు. తన కెరీర్లో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడిన బ్రావో.. 158 వికెట్లు పడగొట్టాడు. గతేడాది పది మ్యాచుల్లో 16 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా లసిత్ మలింగ రికార్డును బద్దలు కొట్టాడు. రెండుసార్లు పర్పుల్ క్యాప్ సాధించిన తొలి విదేశీ బౌలర్‌గా బ్రావో రికార్డ్ క్రియేట్ చేశాడు. 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో నిలిచాడు.
#ChampionForever ???????? Official Statement ???????? @DJBravo47
— Chennai Super Kings (@ChennaiIPL) December 2, 2022
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 144 మ్యాచ్‌లు ఆడిన ఈ కరేబియన్ ఆల్‌రౌండర్.. ఫ్రాంచైజీ తరఫున 168 వికెట్లు తీయడంతోపాటు.. 1556 రన్స్ చేశాడు . తాను ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ను అనుకోవడం లేదని.. కానీ ఐపీఎల్ చరిత్రలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉందని బ్రావో వ్యాఖ్యానించాడు.
మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేవలం 14 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా వాళ్లను వదిలేసింది. వీరిలో డ్వేన్ బ్రావోతోపాటు రాబిన్ ఊతప్ప, యువ సంచలనం జగదీశన్, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే తదితరులు ఉన్నారు. వీరిలో ఊతప్ప కొన్ని రోజుల క్రితమే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు బ్రావో కూడా ఇదే పని చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Cricket, IPL, MS Dhoni