news18-telugu
Updated: October 25, 2020, 5:44 PM IST
సచిన్, సెహ్వాగ్ (ఫైల్ ఫొటో)
నేడు విజయదశమి..! రాముడు రావణాసురుడిపై గెలవడంతో పాటు పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు..! అందుకే దసరా పండగ రోజు రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారంగా వస్తోంది. దేశమంతటా దసరా పండగను అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే పండగను జరుపుకుంటున్నారు. విజయదశమి వేళ పలువురు క్రీడా ప్రముఖులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, గౌతం గంభీర్ సోషల్ మీడియా ద్వారా పండగ విశిష్టతను చెప్పడంతో ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు.
'విజయదశమి సందర్భంగా శ్రీరాముడు తన ఇష్టప్రకారం అందరి కోరికలను నెరవేర్చాలి. మంచి, ప్రేమ, నిజాయతీని నిలబెట్టాలి. అయోధ్యపతి శ్రీరామ్జీ లల్లాకి జై.' వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేసారు.
'మన ప్రయాణం ఎంత సురదూరంగా ఉన్నా.. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. చివరికి చెడుపై మంచే విజయం సాధిస్తుందని దసరా మనకు గుర్తుచేస్తుంది. మనతో పాటు మన చుట్టూ ఉండే ప్రతికూల ప్రభావాలపై విజయం సాధించాలని కోరుతున్నా.' అని సచిన్ ట్వీట్ చేశారు.
చెడుపై మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. విరాట్ కొహ్లీ, గౌతం గంభీర్, సురేష్ రైనా ట్వీట్ చేశారు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 25, 2020, 5:41 PM IST