పాక్‌పై పదికి పది... ‘జంబో’ అనిల్ కుంబ్లే అరుదైన రికార్డుకి 20 ఏళ్లు...

1999, ఫిబ్రవరి 7న ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన అనిల్ కుంబ్లే... 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అరుదైన ఘనత...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 7, 2019, 2:47 PM IST
పాక్‌పై పదికి పది... ‘జంబో’ అనిల్ కుంబ్లే అరుదైన రికార్డుకి 20 ఏళ్లు...
వికెట్ తీసిన అనిల్ కుంబ్లేను అభినందిస్తున్న జట్టు సభ్యులు...(photo: twitter)
  • Share this:
క్రికెట్‌లో ఏ రికార్డులు శాశ్వతం కాదు. ఈ రికార్డును ఎవ్వరూ చెదరగొట్టలేరు... అనుకున్న రికార్డులు కూడా కాలగర్భంలో కలిసిపోయి కొత్త రికార్డులు క్రియేట్ చేయబడ్డాయి. వన్డేల్లో పాక్ క్రికెటర్ సయ్యద్ అన్వర్ 194 పరుగుల రికార్డును క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ డబుల్ సెంచరీతో చెదరగొడితే... సెహ్వాగ్ ఏకంగా 219 పరుగులు చేసి... ఔరా అనిపించాడు. ఆ తర్వాతి తరంలో దూసుకొచ్చిన హిట్ మ్యాన్ ఏకంగా 264 పరుగులు చేసి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో పడేశాడు. అయితే మన ‘జంబో’ అనిల్ కుంబ్లే నమోదుచేసిన ఓ రికార్డు మాత్రం 20 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతకు ముందు ఓ సారి మాత్రమే సాధ్యమైన ఈ రికార్డు, ఆ తర్వాత (ఇప్పటి దాకా) అనిల్ కుంబ్లే పేరిట మాత్రమే ఉంది. అదే ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టడం.

1999, ఫిబ్రవరి 7న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్టుల్లో ‘దస్ కా దమ్’ చూపించాడు. 26.3 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చి పదికి పది వికెట్లు పడగొట్టాడు. జంబో స్పిన్ మాయాజాలానికి పాక్ జట్టులోని ఒక్కొక్క బ్యాట్స్‌మెన్ క్యూ కట్టారు. అంతకుముందు 1956లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు (మ్యాచ్‌లో 19 వికెట్లు) పడగొట్టి మ్యాజిక్ చేశాడు. 43 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉన్న ఆ రికార్డును కుంబ్లే... 1999లో సమం చేశాడు.

Cricket, Ind vs Pak, Anil kumble 10/74,  team india, 10 wickets in One innings, Unbeaten Records in Test Cricket, క్రికెట్ వార్తలు, అనిల్ కుంబ్లే, జంబో అనిల్ కుంబ్లే పది వికెట్లు, ఇండియా vs పాకిస్తాన్, ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు
అనిల్ కుంబ్లే

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కుంబ్లే 4 వికెట్లు దక్కగా, హార్భజన్ 3 వికెట్లు, వెంకటేశ్ ప్రసాద్ రెండు, శ్రీనాథ్ ఓ వికెట్ దక్కాయి.
Cricket, Ind vs Pak, Anil kumble 10/74,  team india, 10 wickets in One innings, Unbeaten Records in Test Cricket, క్రికెట్ వార్తలు, అనిల్ కుంబ్లే, జంబో అనిల్ కుంబ్లే పది వికెట్లు, ఇండియా vs పాకిస్తాన్, ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు
పది వికెట్లు సాధించిన బంతితో కుంబ్లే

రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 420 పరుగుల లక్ష్యం. ఓపెనర్లు అన్వర్, అఫ్రిదీ రాణించడంతో వంద పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈ దశలో 41 పరుగుల వద్ద అఫ్రిదిని అవుట్ చేసిన కుంబ్లే... వికెట్ల పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా మిగిలిన తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు పంపించిన కుంబ్లే... 207 పరుగులకు ఆలౌట్ చేసేశాడు.
Cricket, Ind vs Pak, Anil kumble 10/74,  team india, 10 wickets in One innings, Unbeaten Records in Test Cricket, క్రికెట్ వార్తలు, అనిల్ కుంబ్లే, జంబో అనిల్ కుంబ్లే పది వికెట్లు, ఇండియా vs పాకిస్తాన్, ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు
చివరి వికెట్ తీసిన అనంతరం కుంబ్లే ఆనందం...
ముగ్గురిని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చిన కుంబ్లే... లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీల క్యాచ్‌లు అందుకోవడంతో మిగిలిన వారిని అవుట్ చేశాడు. కుంబ్లే అరుదైన ఇన్నింగ్స్‌కు 20 ఏళ్లు పూర్తయ్యిన సందర్భంగా... విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది ఐసీసీ.

తలకు దెబ్బ తగిలిన సమయంలో కూడా కట్టుకట్టుకుని బౌలింగ్‌కు దిగిన అనిల్ కుంబ్లే... నేటి తరం యువ క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.
Published by: Ramu Chinthakindhi
First published: February 7, 2019, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading