Home /News /sports /

DURING MI VS RR MATCH ONE OF MUMBAI INDIANS BATTER TILAK VARMAS SIXERS LANDED RIGHT ON THE HEAD OF CAMERAMAN SRD

Viral Video - IPL 2022 : తిలక్ వర్మ ఎంత పనిచేశావ్.. నీ షాట్లు అద్భుతంగా చూపించిన కెమెరామెన్ తల పగలగొడతావా..!

Tilak Varma (IPL Twitter)

Tilak Varma (IPL Twitter)

Viral Video - IPL 2022 : ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఓడినప్పటికి తిలక్‌ వర్మ తన ప్రదర్శనతో అభిమానుల మనసు మాత్రం గెలుచుకున్నాడు. తెలుగు కుర్రాడిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తిలక్‌ వర్మ ముంబై ఇండియన్స్‌ లాంటి బలమైన జట్టుకు ఆడడం అతని అదృష్టం అనే చెప్పాలి. కానీ, తిలక్ వర్మ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కి ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ (Tilak Varma) అదరగొట్టాడు. ఈ క్రికెటర్... రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. తిలక్ వర్మ(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఢిల్లీతో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్‌లోనే చూడ ముచ్చటైన షాట్లు ఆడిన తిలక్ వర్మ.. తాజా మ్యాచ్‌లో ఆ ప్రదర్శనను రెట్టింపు చేశాడు. 40 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును తిలక్ ఆదుకున్నాడు. అయితే, మనోడు అదిరే ఇన్నింగ్స్ ఆడినా.. ముంబై ఓటమి పాలైంది. ముంబైపై రాజస్థాన్ జట్టు 23 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ యువ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ కొట్టిన ఓ భారీ సిక్సు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ సిక్స్ లో ఏముంది స్పెషల్. అంతగా వైరల్ అవ్వడానికి కారణం.. ఆ భారీ సిక్స‌ర్ మ్యాచ్‌ను క‌వ‌రేజీ చేస్తున్న కెమెరామెన్‌కు త‌గ‌ల‌డ‌మే ఇందుకు కార‌ణం.

  ముంబై బ్యాటింగ్ సమయంలో కెమెరామెన్ పెను ప్రమాదం తప్పింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో తిలక్ వర్మ(Tilak Varma) సిక్సర్ కొట్టగా బంతి నేరుగా కెమెరామెన్ తలపైకి వెళ్లింది. బంతి కెమెరామెన్ తలకి తగలగానే బౌండరీ లైన్‌పై నిలబడిన ట్రెంట్ బౌల్ట్(Trent Boult) ఆందోళన చెంది అతని వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగాడు. అదృష్టవశాత్తూ కెమెరామెన్‌కు పెద్దగా గాయాలు కాలేదు. ఎందుకంటే లెదర్ బాల్‌ను తలపై తాకడం కూడా ప్రాణాంతకంగా మారుతుంది.

  12వ ఓవర్లో బంతి కెమెరామెన్ తలకు తగిలింది. రాజస్థాన్ స్పిన్నర్ రియాన్ పరాగ్ వేసిన ఐదో బంతికి తిలక్ వర్మ లాంగ్ ఆఫ్ ఓవర్ సిక్సర్ బాదాడు. కెమెరామెన్ తన పని చేస్తుండగా బంతి నేరుగా అతని తలకు తగిలింది. రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌండరీ లైన్‌పై నిలబడి గాయపడిన కెమెరామెన్ పరిస్థితిని అడిగాడు. తను బాగానే ఉన్నాడని కెమెరామెన్ చెప్పాడు. అయితే బోల్ట్ వెంటనే మ్యాచ్ అధికారులను పిలిచి కెమెరామెన్‌కు చికిత్స చేయమని చెప్పాడు. ఆ వెంటనే అతడు తన డ్యూటీలో చేరడంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.


  ఇక, తిలక్‌ వర్మకు ఐపీఎల్‌లో ఇదే డెబ్యూ అర్థసెంచరీ కావడం విశేషం. ముంబై ఇండియన్స్‌ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన అతి పిన్న వయస్కుడుగా తిలక్‌ వర్మ(19 ఏళ్ల 145 రోజులు) రికార్డు కూడా అందుకున్నాడు. అయితే, అంతకుముందు ఇషాన్ కిషన్ (19 ఏళ్ల 278 రోజులు) 2018 సీజన్‌లో ఇదే రాజస్తాన్‌ రాయల్స్‌పై 58 పరుగులు సాధించడం విశేషం. తాజాగా ఇషాన్‌ కిషన్‌ రికార్డును తిలక్‌ బద్దలుకొట్టాడు. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఓడినప్పటికి తిలక్‌ వర్మ తన ప్రదర్శనతో అభిమానుల మనసు మాత్రం గెలుచుకున్నాడు. తెలుగు కుర్రాడిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తిలక్‌ వర్మ ముంబై ఇండియన్స్‌ లాంటి బలమైన జట్టుకు ఆడడం అతని అదృష్టం అనే చెప్పాలి.

  ఇది కూాడా చదవండి : ఐపీఎల్ లో కరోనా కలకలం... తొలి కేసు నమోదు.. పాజిటివ్ గా తేలిన స్టార్...

  టాలెంటెడ్ ఆటగాళ్లను పట్టుకురావడంలో ముంబై ఇండియన్స్‌కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. తెలుగు జట్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తిలక్ వర్మను పట్టించుకోకపోగా ముంబై రూ.1.70 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ ధరకు తిలక్ మూడింతల న్యాయం చేశాడు. అండర్ 19 ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉన్న తిలక్ వర్మ భవిష్యత్తులో స్టార్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తిలక్ వర్మ ఇన్నింగ్స్ చూసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ తిక్క కుదిరిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, Mumbai Indians, Rajasthan Royals, Viral Video

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు