హోమ్ /వార్తలు /క్రీడలు /

Duleep Trophy 2022 : దులీప్ ట్రోఫీ విజేత వెస్ట్ జోన్.. ఫైనల్లో సౌత్ జోన్ పై భారీ విజయం

Duleep Trophy 2022 : దులీప్ ట్రోఫీ విజేత వెస్ట్ జోన్.. ఫైనల్లో సౌత్ జోన్ పై భారీ విజయం

PC : TWITTER

PC : TWITTER

Duleep Trophy 2022 : దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ (Duleep Trophy) 2022 విజేతగా వెస్ట్ జోన్ (West Zone) నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్ లో 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ ఘనవిజయం సాధించింది. 529 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌత్ జోన్ తన రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Duleep Trophy 2022 : దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ (Duleep Trophy) 2022 విజేతగా వెస్ట్ జోన్ (West Zone) నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్ లో 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ ఘనవిజయం సాధించింది. 529 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌత్ జోన్ తన రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది.  71.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా దులీప్ ట్రోఫీ వెస్ట్ జోన్ ఖాతాలో చేరింది. వెస్ట్ జోన్ కెప్టెన్ గా  అజింక్యా రహానే (Ajinkya Rahane) ట్రోఫీని అందుకున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 151/6తో ఐదో రోజు ఆటను కొనసాగించిన సౌత్ జోన్ చివరి రోజు 83 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 4 వికెట్లను కోల్పోయింది. రోహన్ 93 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రవితేజ 53 పరుగులతో చివర్లో పోరాడాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో ములాని 4 వికెట్లు తీశాడు. జైదేవ్ ఉనాద్కట్, సెత్ చెరో 2 వికెట్లతో రాణించారు.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో వెస్ట్ జోన్ భారీ స్కోరును సాధించింది.128 ఓవర్లలో 4 వికెట్లకు 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాస్తవానికి రెండో ఇన్నింగ్స్ ను వెస్ట్ జోన్ 57 పరుగులు వెనుకబడి మొదలు పెట్టింది. అయితే యశస్వీ జైస్వాల్ (265) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. సర్ఫరాజ్ ఖాన్ (127) సెంచరీ సాధించాడు. శ్రేయస్ అయ్యర్ (71), పటేల్ (51 నాటౌట్) అర్ధ సెంచరీలు సాధించారు. ఫలితంగా వెస్ట్ జోన్ భారీ స్కోరును అందుకుంది.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో వెస్ట్ జోన్ 96.3 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. హెట్ పటేల్ (98) టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెమీఫైనల్లో 10 వికెట్లతో సత్తా చాటిన సాయికిషోర్.. ఫైనల్ లోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌత్ జోన్ 83.1 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. తద్వారా తొలి ఇన్నింగ్స్ లో 57 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సౌత్ జోన్ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్ లో సౌత్ జోన్ ఆధిక్యం సాధించడంతో.. రెండో ఇన్నింగ్స్ లో ఆలౌట్ అవ్వకుండా ఉంటే చాలు ఆ జట్టు చాంపియన్ గా నిలుస్తుంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సౌత్ జోన్ ఆలౌట్ కావడంతో దులీప్ ట్రోఫీ చాంపియన్ గా వెస్ట్ జోన్ నిలిచింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hanuma vihari, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు