• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • DUE TO CORONA EFFECT CRICKET AUSTRALIA POSTPONES SOUTH AFRICA AND NEWZEALAND TEAM QUALIFY FOR WTC FINAL SRD

Corona Effect : కరోనా ఎఫెక్ట్.. టాప్ జట్ల మధ్య సిరీస్ రద్దు.. లాభపడిన న్యూజిలాండ్ జట్టు

Photo Credit : Twitter

Corona Effect : కరోనా..ఈ మహమ్మారి దెబ్బకి ఎన్నో రంగాలు కుదేలయ్యాయ్. ఇప్పటికీ ఈ వైరస్ ప్రభావం కొన్ని రంగాలపై ఉంది. క్రీడా రంగాన్ని కూడా బాగానే దెబ్బకొట్టింది ఈ డెడ్లీ వైరస్. లేటెస్ట్ గా సౌతాఫ్రికాలో క‌రోనా సెకండ్ వేవ్‌, వైర‌స్‌ కొత్త వేరియంట్ కార‌ణంగా ఆ దేశ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌. అయితే ఈ సిరీస్ రద్దు న్యూజిలాండ్ టీమ్ కు కలిసొచ్చింది.

  • Share this:
    కరోనా..ఈ మహమ్మారి దెబ్బకి ఎన్నో రంగాలు కుదేలయ్యాయ్. ఇప్పటికీ ఈ వైరస్ ప్రభావం కొన్ని రంగాలపై ఉంది. క్రీడా రంగాన్ని కూడా బాగానే దెబ్బకొట్టింది ఈ డెడ్లీ వైరస్. లేటెస్ట్ గా సౌతాఫ్రికాలో క‌రోనా సెకండ్ వేవ్‌, వైర‌స్‌ కొత్త వేరియంట్ కార‌ణంగా ఆ దేశ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌. ఈ మేర‌కు క్రికెట్ సౌతాఫ్రికాకు రాసిన లేఖ‌ను ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌లో సౌతాఫ్రికాకు వెళ్ల‌డం ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్‌, స‌పోర్ట్ స్టాఫ్‌, ఆసీస్ క‌మ్యూనిటీకి ఏమాత్రం మంచిది కాద‌ని ఆ లేఖ‌లో క్రికెట్ ఆస్ట్రేలియా స్ప‌ష్టం చేసింది. ఈ టూర్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ఎన్నో ఏర్పాట్లు చేసింద‌ని, తాము కూడా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టూర్ కొన‌సాగించాల‌నే భావించినా ఇప్పుడు వాయిదా వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌ని తెలిపింది. ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని, ముఖ్యంగా ఇప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో టూర్ ర‌ద్దు చేసుకోవ‌డం త‌మ‌కు చాలా బాధ క‌లిగిస్తోంద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. సౌతాఫ్రికాలో మ‌ళ్లీ ఎప్పుడు ప‌ర్య‌టిస్తామో త‌ర్వాత వెల్ల‌డిస్తామ‌ని చెప్పింది. ఈ నెల 14 నుంచి సౌతాఫ్రికాలో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ప్రారంభం కావాల్సి ఉంది.

    అయితే, ఆసీస్‌ దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడంతో న్యూజిలాండ్‌ జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఒకవైపు జనవరి చివరివారంలోనే దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని క్రికెట్‌ ఆస్ట్రేలియా టిమ్‌ పైన్‌ నేతృత్వంలోని 19 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. ఇదే విషయమై ట్విటర్‌లో స్పందిస్తూ లేఖను విడుదల చేసింది.


    ఇక జూన్‌లో జరగనున్న వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కివీస్‌ నిలిచింది. ఐసీసీ ఇటీవలే ప్రకటించిన ర్యాంకింగ్స్‌ ప్రకారం కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోని న్యూజిలాండ్‌ జట్టు 118 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అదే రేటింగ్‌ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉన్నా.. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల వ్యత్యాసం ఉంది. ఇక 113 రేటింగ్‌ పాయింట్లతో ఆసీస్‌ మూడోస్థానంలో, 108 రేటింగ్‌ పాయింట్లతో ఇంగ్లండ్‌ నాలుగోస్థానంలో ఉన్నాయి. అయితే, జూన్‌లో లార్డ్స్‌ వేదికగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇక త్వరలో జరగనున్న టీమిండియా-ఇంగ్లండ్ సిరీస్ ల విజేత వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించే రెండో జట్టుగా నిలిచే అవకాశం ఉంది.
    Published by:Sridhar Reddy
    First published: