Home /News /sports /

Krunal Pandya : కృనాల్ పాండ్యాకు కరోనా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. అప్పుడే జాగ్రత్త పడి ఉంటే..

Krunal Pandya : కృనాల్ పాండ్యాకు కరోనా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. అప్పుడే జాగ్రత్త పడి ఉంటే..

కృనాల్ పాండ్యా (ఫైల్ ఫోటో)

కృనాల్ పాండ్యా (ఫైల్ ఫోటో)

Krunal Pandya : 11 మంది అందుబాటులో లేకపోవడంతో.. లంక పర్యటనకు నెట్ బౌలర్లుగా వెళ్లిన వారు జట్టులోకి వచ్చారు. దీంతో జట్టు బలహీనంగా మారడంతో భారత్ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి.

  13 ఏళ్ల తర్వాత టీమిండియా(Team India)పై ఓ సిరీస్ విజయాన్ని అందుకుంది శ్రీలంక జట్టు. 2020 నుంచి వరుసగా సిరీస్‌లు ఓడిపోతూ వస్తున్న శ్రీలంక జట్టుకి దక్కిన ఊరట విజయం ఇది. కృనాల్ పాండ్యా (Krunal Pandya) కరోనా బారిన పడడమే కాకుండా తనతో క్లోజ్ కాంటాక్ట్ అయిన 8మందిని జట్టుకి దూరం చేశాడు. జట్టుకి దూరమైన వారిలో పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్ వంటి స్టార్ ప్లేయర్లు ఉండడంతో టీమిండియాపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. చాలా మంది ఫ్యాన్స్ కృనాల్ పాండ్యాపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కృనాల్ పాండ్యాకే ఇవ్వాలని అప్పట్లో ఫ్యాన్స్ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కృనాల్ పాండ్యా కరోనా వ్యవహారంలో కొన్ని షాకింగ్ నిజాలు ఆలస్యంగా బయటపడ్డాయ్.కృనాల్‌ గొంతునొప్పి వస్తోందని చెప్పిన వెంటనే ఓ బీసీసీఐ వైద్యుడు ర్యాపిడ్‌ టెస్టు చేయలేదట. అంతేకాకుండా జట్టు సమావేశానికీ అతడికి అనుమతి ఇచ్చాడట. మూడు వన్డేల సిరీస్, తొలి టీ20 సజావుగా సాగాయి. మొదటి టీ20 తర్వాత కృనాల్‌ పాండ్యాకు కరోనా వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. దాంతో రెండో టీ20ని ఒక రోజు వాయిదా వేశారు. అంతేకాకుండా కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందిని ఐసోలేషన్‌కు పంపింది బీసీసీఐ. దీంతో స్టార్ ఆటగాళ్లు చివరి రెండు మ్యాచులకు దూరమయ్యారు.

  11 మంది అందుబాటులో లేకపోవడంతో.. లంక పర్యటనకు నెట్ బౌలర్లుగా వెళ్లిన వారు జట్టులోకి వచ్చారు. దీంతో జట్టు బలహీనంగా మారడంతో భారత్ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. అయితే గొంతునొప్పి అని చెప్పిన వెంటనే వైద్యాధికారి స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు. నిజానికి జులై 26న కృనాల్‌ పాండ్యా తనకు గొంతు నొప్పి వస్తోందని బీసీసీఐ ప్రధాన వైద్యాధికారి అయిన అభిజిత్‌ సల్వీకి చెప్పాడట. నిబంధనల ప్రకారం అదే రోజు కృనాల్‌కి ర్యాపిడ్‌ టెస్టు చేయలేదు. పైగా జట్టు సమావేశంలో పాల్గొనేందుకు అతడికి అనుమతి ఇచ్చాడు. మరుసటి రోజైన 27న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేశాడు. దాంతో ఫలితాలు మధ్యాహ్నం వచ్చాయి. ఇక చేసేదిలేక మ్యాచును వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ, ఎస్‌ఎల్‌సీ ప్రకటించాయి. కృనాల్‌తో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మందికీ పరీక్షలు చేశారు. అప్పుడు అందరికి నెగెటివ్‌ అనే వచ్చింది. ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే.. శ్రీలంక నుంచి బయల్దేరే ముందు కృష్ణప్ప గౌతమ్‌, యుజ్వేంద్ర చహల్‌కు పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

  ఇది కూడా చదవండి :  KL Rahul - Suniel Shetty : " అల్లుడు నువ్వు అదుర్స్.. నా బర్త్ డే గిఫ్ట్ సూపరో సూపర్ "

  "వాస్తవానికి సిరీస్‌ రద్దవ్వకుండా బీసీసీఐ కార్యదర్శి జే షా జోక్యం చేసుకున్నారు. కృనాల్‌ పాండ్యాతో కలిసిన వారిని ఐసోలేషన్‌కు పంపించారు. జే షా చర్యల వల్లే ఈ సిరీస్‌ సజావుగా కొనసాగింది. లేదంటే మధ్యలోనే ముగిసేది. శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు ఇప్పుడు మేలు జరిగింది. ఏదేమైనా బీసీసీఐ వైద్యబృందం చురుగ్గా స్పందించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది " అని ఆ బీసీసీఐ అధికారి తెలిపారు. కరోనా సోకడంతో కృనాల్‌, గౌతమ్‌, చహల్ మిగతా ఆటగాళ్లతో కలిసి స్వదేశానికి రాలేదు. ఆగస్టు ఆరంభంలో వారు ఇళ్లకు తమతమ చేరుకున్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా లపైన పడింది. వారిద్దరి ఇంగ్లండ్ చేరిన ఇప్పుడు క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Bcci, Corona effect, Cricket, Hardik Pandya, India vs srilanka

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు