Home /News /sports /

DRS TO BE USED IN MEN T20 WORLD CUP FOR THE FIRST TIME FROM WHICH TOURNAMENT DRS WAS INTRODUCED FOR T20S JNK

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారిగా ఆ నిబంధన.. ఇప్పటి వరకు దాన్ని ఉపయోగించలేదంటే నమ్ముతారా?

టీ20 వరల్డ్ కప్ కోసం ప్లేయింగ్ కండిషన్స్ విడుదల చేసిన ఐసీసీ (PC: Cricket Australia)

టీ20 వరల్డ్ కప్ కోసం ప్లేయింగ్ కండిషన్స్ విడుదల చేసిన ఐసీసీ (PC: Cricket Australia)

T20 World Cup: మరో వారం రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. యూఏఈ, ఒమన్ వేదికల్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి సంబంధించిన నిబంధనలను ఐసీసీ విడుదల చేసింది. ఈ సారి కొత్తగా డీఆర్ఎస్ నిబంధన టీ20 వరల్డ్ కప్‌లో ఉపయోగించనున్నారు.

    యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 (IPL 2021) ముగిసిన వెంటనే మరో ధనాధన్ క్రికెట్‌కు తెరలేవనున్నది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నది. ఒమన్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఆ తర్వాత యూఏఈ వేదికగా సూపర్ 12 రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపత్యంలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఐసీసీ (ICC) నిబంధనలు విడుదల చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో తొలి సారిగా డెషిషన్ రెవ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్- DRS)ను ప్రవేశ పెట్టింది. ప్రతీ ఇన్నింగ్స్‌లో జట్టుకు 2 రివ్యూలు ఉంటాయి. ఐపీఎల్ వంటి టీ20 లీగ్స్‌లో ఒకటే రివ్యూ ఉంటుండగా.. టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం రెండు రివ్యూలకు ఐసీసీ అవకాశం కల్పించింది. కోవిడ్-19 కారణంగా అనుభవజ్ఞలైన అంపైర్లు అందుబాటులో ఉండటం కష్టంగా మారడంతో.. అంపైరింగ్ లోపాలను సరిదిద్దేందుకు గాను రెండు డీఆర్ఎస్‌లకు అవకాశం ఇచ్చినట్లు ఐసీసీ తెలిపింది.

    టీ20 వరల్డ్ కప్ జరుగక ఇప్పటికి 5 ఏళ్లు గడిచింది. పలు కారణాల వల్ల ఐసీసీ ఈ టోర్నీని నిర్వహించలేక పోయింది. ఐసీసీ ఆధ్వర్యంలో 2016లో చివరి సారిగా పురుషుల టీ20 వరల్డ్ కప్ జరిగింది. ఆ సమయంలో టీ20ల్లో డీఆర్ఎస్ ఇంకా ప్రవేశపెట్టలేదు. ఐసీసీ తొలి సారిగా డీఆర్ఎస్‌ను 2018 మహిళల టీ20 వరల్డ్ కప్‌ను కరేబియన్ దీవుల్లో నిర్వహించినప్పటి నుంచి మాత్రమే డీఆర్ఎస్ ఉపయోగిస్తున్నది. దీంతో తాజాగా పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో మాత్రమే డీఆర్ఎస్ ఉపయోగించారు.

    T20 World Cup: లక్కీ చాన్స్ కొట్టేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్.. టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక


    ఇక టీ20 వరల్డ్ కప్‌లో ఫలితం తేలడానికి మినిమం ఓవర్ల సంఖ్య 5గా నిర్ణయించింది. అదే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు అయితే 10 ఓవర్లుగా ఐసీసీ పేర్కొన్నది. వర్షాలు లేదా ఇతర కారణాల వల్ల పూర్తి ఓవర్ల కోటా సాధ్యం కాకపోతే పైన పేర్కొన్న విధంగా కనీస ఓవర్లను పరిగణలోకి తీసుకొని మ్యాచ్‌ను నిర్వహించడం లేదా డక్‌వర్త్ లూయీస్ పద్దతిని ఉపయోగించడం జరుగుతుంది. మరోవైపు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేను కూడా పెట్టారు. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ సమయంలో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఏర్పాటు చేయలేదు. దీంతో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య సెమీస్ వర్షం కారణంగా జరగకపోవడంతో గ్రూప్ దశలో ఫలితాన్ని బట్టి ఇండియా ఫైనల్‌కు చేరింది. మరోసారి ఇలాంటి తప్పు జరుగకుండా పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు రిజర్వ్ డేను ఏర్పాటు చేసింది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: ICC, T20 World Cup 2021

    తదుపరి వార్తలు