హోమ్ /వార్తలు /క్రీడలు /

Double Century: తగ్గేదేలే..T20ల్లో డబుల్ సెంచరీ..ఇన్నింగ్స్ లో ఏకంగా 22 సిక్సర్లు, 17 ఫోర్లు

Double Century: తగ్గేదేలే..T20ల్లో డబుల్ సెంచరీ..ఇన్నింగ్స్ లో ఏకంగా 22 సిక్సర్లు, 17 ఫోర్లు

టీ20ల్లో సెంచరీ చేయడమే గగనం. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మాటలు కాదు. జట్టు మొత్తం కలిసి చేయగలిగే పరుగులను ఒక్కడే అలవోకగా చేసేశాడు.

టీ20ల్లో సెంచరీ చేయడమే గగనం. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మాటలు కాదు. జట్టు మొత్తం కలిసి చేయగలిగే పరుగులను ఒక్కడే అలవోకగా చేసేశాడు.

టీ20ల్లో సెంచరీ చేయడమే గగనం. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మాటలు కాదు. జట్టు మొత్తం కలిసి చేయగలిగే పరుగులను ఒక్కడే అలవోకగా చేసేశాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Andhra Pradesh

  టీ20ల్లో సెంచరీ చేయడమే గగనం. అలాంటిది డబుల్ సెంచరీ (Double Century) చేయడమంటే మాటలు కాదు. జట్టు మొత్తం కలిసి చేయగలిగే పరుగులను ఒక్కడే అలవోకగా చేసేశాడు. అమెరికా (America) టీ20ల లీగ్ లోని అట్లాంటా ఓపెన్ లో వెస్టిండీస్ బ్యాటర్ రహ్కీమ్ కార్న్ వాల్ తుఫాన్ ఇన్నింగ్స్ తో పెను విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థిపై ఏ మాత్రం కనికరం లేకుండా ఎడాపెడా బౌండరీలతో డబుల్ సెంచరీ (Double Century) సాధించాడు.

  కేవలం 77 బంతులు ఎదుర్కొని 205 పరుగులు చేశాడు రహ్కీమ్ కార్న్ వాల్. అతని ఇన్నింగ్స్ లో 22 సిక్సర్లు, 17 ఉండడం గమనార్హం. మొత్తం 205 పరుగుల్లో కార్న్ వాల్ కేవలం 39 బంతుల్లో బౌండరీల ద్వారానే 200 పరుగులు చేశాడు. అతని భీకర బ్యాటింగ్ తో స్ట్రైక్ రేట్ 266.23కు చేరింది. మొత్తంగా కార్న్ వాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 326 పరుగులు చేసింది. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన స్క్వేర్ డ్రైవ్ పాంథర్స్ జట్టు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  తన తుఫాన్ ఇన్నింగ్స్ తో ఈ వెస్టిండీస్ ప్లేయర్ ఒక్కసారిగా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు కేవలం టెస్టులు (Tests) మాత్రమే ఆడాడు కార్నివాల్. వన్డేలు, టీ20ల్లోనూ ఇప్పటివరకు ఆడని ఈ వెస్టిండీస్ ప్లేయర్ ఒక్క ఇన్నింగ్స్ తో తన విశ్వరూపాన్ని చూపించాడు. మరి ఈ ఒక్క ఇన్నింగ్స్ తో రాబోయే టీ20 ప్రపంచకప్ కు ఎంపిక అవుతాడో లేదో చూడాలి.  వెస్టిండీస్ ఆటగాళ్లు అంటేనే బాదుడుకు మారు పేరు. క్రిస్ గేల్, సిమ్మన్స్, రస్సెల్, నరైన్ ఇలా చెప్పుకుంటే అందరూ ఇదే కోవలోకి వస్తారు. వారు చేసే పరుగులో సింగిల్స్, డబుల్స్ కంటే మైదానం బయట బంతి పడడమే ఎక్కువగా కనిపిస్తుంది. అంతలా పవర్ హిట్టింగ్ చేసే సామర్ధ్యం ఆ ఆటగాళ్ల సొంతం.

  ఇక ఇప్పటివరకు ఇలాంటి తరహా ఆట అరుదుగు చూస్తుంటాం. ఇప్పటివరకు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. కేవలం 76 బంతుల్లో 172 పరుగులు చేసిన ఫించ్ ఏకంగా 16 ఫోర్లు, 10 సిక్సులు బాదాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే క్రిస్ గేల్ (Chris Gayle0 బెంగళూరు తరపున ఆడిన ఆట అభిమానుల కళ్లలో మెదులుతూ ఉంటుంది. పూణే వారియర్స్ పై క్రిస్ గేల్ 66 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు గేల్. ఇదే ఇప్పటివరకు ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: T20

  ఉత్తమ కథలు