Virat Kohli: కోహ్లీతో పెట్టుకోవద్దు.. లండన్ వీధుల్లో విప్పేసి తిరుగుతడు అంటున్న గంగూలీ

కోహ్లీతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటున్న గంగూలీ.. (PC: BCCI)

టీమ్ ఇండియాకు దూకుడు అంటే నేర్పిన మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. తన దూకుడు కంటే విరాట్ కోహ్లీ దూకుడే ఎక్కువనీ.. అతడితో ఛాలెంజ్ చేయవద్దని గంగూలీ అంటున్నాడు.

 • Share this:
  టీమ్ ఇండియాకు (Team India) కెప్టెన్ అంటే అణగి మణిగి ఉండాలని.. అందరినీ కంట్రోల్ చేస్తూ పెద్దరికం ప్రదర్శించాలనే మూస ధోరణిని బద్దలు కొట్టిన మొదటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly). రాయల్ బెంగాల్ ప్రిన్స్‌గా పిలువబడే గంగూలీ.. క్రికెట్ (Cricket) ఆడే సమయంలో కూడా రాజులాగే బిహేవ్ చేసేవాడు. సీనియర్లకు గౌరవం ఇస్తుండే వాడు. కానీ అదే సమయంలో ఏ పని చెబితే అది చేసే వాడు కాదట. కనీసం గ్రౌండ్‌లోకి వెళ్లి డ్రింక్స్ ఇవ్వమని చెప్పినా గంగూలీ వెళ్లేవాడు కాదని చెబుతుంటారు. ఇక కెప్టెన్ అయ్యాక గంగూలీ విన్నింగ్ రికార్డు కూడా గత కెప్టెన్లతో పోల్చితే ఎంతో మెరుగుగా ఉంటుంది. ముఖ్యంగా గంగూలీ కెప్టెన్సీలో లార్డ్స్ (Lord's) వేదికగా జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. భారీ స్కోర్ ఛేదించే క్రమంలో 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో.. మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ కలసి మ్యాచ్‌ను అద్భుతంగా గెలిపించారు. కైఫ్ వీరోచితంగా పోరాడి మరో రెండు బంతులు ఉండగానే విజయాన్ని అందించాడు.

  భారత జట్టు అలా విజయాన్ని అందుకున్న వెంటనే లార్డ్స్ బాల్కనీలో ఉన్న సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పేసి సంబరాలు చేసుకున్నాడు. ఇంత వరకు ఏ కెప్టెన్ కూడా అలా జెర్సీ విప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేయలేదు. ముఖ్యంగా లార్డ్స్ మైదానంలో కఠినమైన రూల్స్ ఉంటాయి. అయినా సరే ప్రిన్స్ గంగూలీ వాటిని పట్టించుకోకుండా షర్ట్ విప్పేసి ఆనందంలో మునిగిపోయాడు. ఇప్పటికీ ఆనాటి దృశ్యాన్ని చాలా మంది గుర్తు చేస్తుంటారు. తాజాగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమానికి వీరేంద్ర సెహ్వాగ్‌తో కలసి సౌరవ్ గంగూలీ పాల్గొన్నాడు. అక్కడ వ్యాఖ్యాతగా ఉన్న మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ప్రశ్న వేశాడు. 'ఇంగ్లాండ్‌లో విజయం సాధిస్తే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని (Virat Kohli) కూడా షర్ట్ విప్పేసి సెలెబ్రేట్ చేయమని చెబుతారా?' అని గంగూలీని బచ్చన్ అడిగాడు.

  అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు తొలుత సమాధానం ఇవ్వడానికి గంగూలీ తటపటాయించాడు. ఆ రోజు తాను చేసిన పని ఇప్పుడు తలచుకుంటే కొంచెం సిగ్గుగా ఉంటుందని అన్నాడు. అయితే తాను కోహ్లీకి అలాంటి ఛాలెంజ్ విసరలేను. ఎందుకంటే.. నేను స్టేడియంలో షర్ట్ విప్పగలవా అని అడిగితే.. లండన్ వీధుల్లో కూడా షర్ట్ విప్పేసి తిరుగుతాడు. నేనే దూకుడు అంటే కోహ్లీ మరింత దూకుడు. కోహ్లీకి ఏదైనా నెమ్మదిగా చెప్పాలి. మనం ఛాలెంజ్ చేస్తే అతను మామూలుగా తీసుకోడు అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

  Star Sports: అమ్మో.. స్టార్ స్పోర్ట్స్‌లో 10 సెకెన్ల యాడ్‌కు రేటెంతో తెలుసా? రెండో ఫేస్ ఐపీఎల్‌కు పెరిగిన ధర


   

  Published by:John Naveen Kora
  First published: