అప్పటివరకు ఏమీ అడగవద్దు.. సస్పెన్స్‌లో పెట్టేసిన ధోనీ..

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్ ముగిసిన తర్వాత ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. విండీస్,దక్షిణాఫ్రికా,బంగ్లాదేశ్‌లతో జరిగిన సిరీస్‌లకు ధోనీ దూరంగా ఉన్నాడు.

news18-telugu
Updated: November 28, 2019, 7:47 AM IST
అప్పటివరకు ఏమీ అడగవద్దు.. సస్పెన్స్‌లో పెట్టేసిన ధోనీ..
ఎంఎస్ ధోనీ
  • Share this:
టీమిండియాలో ఎంఎస్ ధోనీ భవితవ్యంపై కొన్నాళ్లుగా హాట్ హాట్ చర్చ జరుగుతోంది. వరల్డ్ కప్ తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టని రాంచీ డైనమైట్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడా? అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే టీమిండియా కోచ్ రవిశాస్త్రి,ఇతర క్రికెటర్లకు పదేపదే మీడియా సమావేశాల్లో ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఎట్టకేలకు ధోనీ వీటిపై స్పందించాడు. 'వచ్చే ఏడాది జనవరి వరకు నన్నేమీ అడగవద్దు' అంటూ అందరి నోళ్లు మూయించేశాడు. బుధవారం ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా ధోనీ మాట్లాడాడు.

జనవరి నెలను డెడ్‌లైన్‌గా పెట్టుకున్న ధోనీ.. ఆ తర్వాతే తన క్రికెట్ కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.కాగా,ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్ ముగిసిన తర్వాత ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. విండీస్,దక్షిణాఫ్రికా,బంగ్లాదేశ్‌లతో జరిగిన సిరీస్‌లకు ధోనీ దూరంగా ఉన్నాడు. అసలు సెలక్షన్ కమిటీకి కూడా ధోని అందుబాటులో లేకుండా పోయాడు. అదే సమయంలో కొన్నాళ్లుగా ధోనీ ఆటతీరు కూడా విమర్శలకు కారణమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌పై ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ సస్పెన్స్‌కు తెరపడాలంటే జనవరి వరకు వేచి చూడాల్సిందే.
First published: November 28, 2019, 7:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading