హోమ్ /వార్తలు /క్రీడలు /

urvashi rautela: అసలు క్రికెట్ చూడాను.. కానీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం!

urvashi rautela: అసలు క్రికెట్ చూడాను.. కానీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం!

Urvashi Rautela

Urvashi Rautela

బాలీవుడ్‌ నటీమణి ఊర్వశి రౌటెలా(Urvashi Rautela)  తను ఎక్కువగా క్రికెట్ వీక్షించనని అందువల్ల క్రికెటర్లు పెద్దగా తెలియదన్నారు. కానీ సచిన్‌, విరాట్‌ కోహ్లీ అంటే మాత్రం గౌరవం అని తెలిపింది

  బాలీవుడ్‌ నటీమణి ఊర్వశి రౌటెలా(Urvashi Rautela)  తను ఎక్కువగా క్రికెట్ వీక్షించనని అందువల్ల క్రికెటర్లు పెద్దగా తెలియదన్నారు. కానీ సచిన్‌, విరాట్‌ కోహ్లీ అంటే మాత్రం గౌరవం అని తెలిపింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గోన్న ఆమె అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చింది.


  ‘మీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు?’ అని ఓ అభిమాని అడగ్గా దాని జవాబు ఇస్తూ... ‘నేను క్రికెట్‌ చూడను. నాకు క్రికెటర్ల గురించి కూడా పెద్దగా తెలియదు. సచిన్‌ , విరాట్‌ కోహ్లి అంటే మాత్రం గౌరవం’ అని జవాబిచ్చింది. అయితే గతంలో ఊర్వశి టీమ్‌ఇండియా క్రికెటర్‌ రిషభ్ పంత్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు బలం చేకూరుస్తూ.. పంత్‌తో కలిసి ఊర్వశి రౌటెలా భోజనం చేస్తున్న చిత్రాలు ఇంటర్నెట్లో వైరలయ్యాయి. తర్వాత పంత్‌ ఆమె నెంబర్ బ్లాక్ చేసినట్టూ తెలిసింది.


  బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి ఊర్వశీ రౌటెలా సోషల్ మీడియా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. ఈ మాజీ విశ్వసుందరి అప్పుడప్పుడు ఇన్‌స్టాలో తెగ సందడి చేస్తోంది. తాజా..తాజా అందాలతో మతి పోగొడుతుంది. వీడియోలో బికినీలు డ్రెస్‌లు.. క్యాట్ వాక్‌లు చేస్తూ తన ఒంపుసొంపులతో ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ చేస్తోంది. రౌటెలా అందచందాలను చూసి ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Sachin Tendulkar, Urvashi Rautela, Virat kohli

  ఉత్తమ కథలు