హోమ్ /వార్తలు /క్రీడలు /

Sachin Tendulkar: ఒక్క మాటతో అర్జున్ ఆశయాన్ని హత్య చేయోద్దు!

Sachin Tendulkar: ఒక్క మాటతో అర్జున్ ఆశయాన్ని హత్య చేయోద్దు!

Sachin Tendulkar family

Sachin Tendulkar family

అర్జున్‌ టెండుల్కర్‌ ఆమ్ముడుపోవడంపై బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఆనందం వ్యక్తం చేశారు. అర్జున్‌కు క్రికెట్‌పై అమితమైన ఇష్టం ఉందని,అతని ఆసక్తిని ఏమాత్రం ఆశద్ర చేయవద్దని సూచించారు

  ఐపీఎల్ వేలంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఆమ్ముడుపోవడంపై బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఆనందం వ్యక్తం చేశారు. అర్జున్‌కు క్రికెట్‌పై అమితమైన ఇష్టం ఉందని,అతని ఆసక్తిని ఏమాత్రం ఆశద్ర చేయవద్దని సూచించారు. నెపోటిజంతో హితవు కానీ వ్యాఖ్యలు తనపై మాట్లాడవద్దని తెలిపారు. ఇక తాజాగా అంబానీ గ్రూపు ఆధ్వర్యంలోని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ రూ. 20 లక్షల నగదులో కొనగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ముంబై ప్రాంఛైజీకి సచిన్ మెంటర్‌గా వ్యవహారిస్తున్న విషయం తేలిసిందే. ఈ కారణంగా అర్జున్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

  ఇటీవలే రైతు నిరసనలపై విదేశీ సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలను సచిన ఖడించారు. వాటిని అర్జున్‌ ఐపీఎల్‌ అరంగేట్రాన్ని ముడిపెడుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన ఫర్హాన్‌ అక్తర్‌ " అర్జున్,నేను ఒకే జిమ్‌లో తరచుగా కలుస్తూ ఉంటాం. అతను అందులో ఎంతగానో శ్రమిస్తుంటాడు. క్రికెటర్‌గా ఎదిగే ఎదగాలన్నా అత్రుత అర్జున్‌లో కనిపిస్తోంది. అతని ఆశయాన్ని నెపోటిజం విమర్శలు నీరుగార్చ వద్దు. అది క్రూరమైన వ్యాఖ్య.. అర్జున్‌లో ఉన్న ఉత్సాహాన్ని మర్డర్‌​ చేయోద్దు. అతని కెరీర్‌లో మెుదలుపెట్టబోతున్న సరికొత్త ప్రయాణానికి ముందే అంటకం కలిగించకండి’’ అని ట్విటర్‌ వేదికగా కామెంట్ చేశారు.

  అయితే కేవలం సచిన్ కొడుకనే ముంబై అర్జున్‌ను జట్టులోకి తీసుకుందని, క్రికెట్‌లో నెపోటిజం ఎక్కువైపోయిందని చాలా మంది విమర్శించారు. అర్జున్‌ను ముంబై తీసుకుంటుందని ముందే ఊహించామని, అసలు అతనికి ఏం అర్హత ఉందని వేలంలో కొనుగోలు చేశారని చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేశారు.అర్జున్‌ను తీసుకోవడంపై ముంబై టీమ్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ సైతం ఓ వీడియోలో స్పష్టతినిచ్చే ప్రయత్నం చేశాడు. "అర్జున్‌ నైపుణ్యాల గురించి మా కోచింగ్ సిబ్బంది మహేల జయవర్ధనె, జహీర్ ‌ఖాన్‌ ముందే చెప్పారు. సచిన్‌ తనయుడు ఎడమ చేతి వాటం ఫాస్ట్‌బౌలర్‌, బ్యాట్స్‌మన్‌ అని వివరించారు. ప్రపంచ క్రికెట్‌లో ఇలా ఎక్కువ మంది లేరని చెప్పారు. ఇతర యువ ఆటగాళ్లలాగే అర్జున్‌ కూడా ఈ స్థాయికి చేరుకున్నాడు. జట్టులో ఆటగాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి వారిలోని అత్యుత్తమ నైపుణ్యాలను బయటకు తెస్తాం. అయితే అదంతా ఆయా ఆటగాళ్లు కష్టపడటంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకోసం తగిన ఏర్పాట్లు తాము చేస్తాం. భవిష్యత్‌లో అర్జున్‌ కూడా ఇతరుల్లాగే మెరుగైన క్రికెటర్‌గా తయారవుతాడు" అని ఆకాశ్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Arjun Tendulkar, IPL 2021, Sachin Tendulkar

  ఉత్తమ కథలు