Home /News /sports /

Don Bradman: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ కెరీర్‌లో అదొక మాయని మచ్చ.. ఇలాంటి చెత్త రికార్డు ఆయన పేరిట ఉందని తెలుసా?

Don Bradman: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ కెరీర్‌లో అదొక మాయని మచ్చ.. ఇలాంటి చెత్త రికార్డు ఆయన పేరిట ఉందని తెలుసా?

దిగ్గజ బ్యాటర్ బ్రాడ్‌మాన్ కెరీర్‌లోని చెత్త రికార్డు తెలుసా? (AP)

దిగ్గజ బ్యాటర్ బ్రాడ్‌మాన్ కెరీర్‌లోని చెత్త రికార్డు తెలుసా? (AP)

Don Bradman: క్రికెట్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ టెస్టుల్లో 99.94 సగటుతో కెరీర్ ముగించిన సంగతి తెలిసిందే. టెస్ట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో భారీ పరుగులు చేసిన బ్రాడ్‌మాన్.. తన కెరీర్‌లో కేవలం 6 సిక్సులు మాత్రమే కొట్టాడు. సిక్సుల విషయంలో బ్రాడ్‌మాన్‌కు అత్యంత చెత్త రికార్డు ఉన్నది.

ఇంకా చదవండి ...
    టెస్టు క్రికెట్‌లో (Test Cricket) అతడో దిగ్గజం (Legend). క్రికెట్ మాస్టర్ అంటే గుర్తొచ్చేది అతడి పేరే. ఇప్పటి వరకు అతడి 99.94 సగటును ఎవరూ అందుకోలేదంటే అతిశయోక్తి కాదు. అతడే సర్ డాన్ బ్రాడ్‌మాన్ (Sir Don Bradman). ఆస్ట్రేలియాలో (Australia) పుట్టిన ఈ దిగ్గజ బ్యాటర్ అందుకోని శిఖరాలంటూ లేవు. అటూ ఫస్ట్ క్లాస్ (First Class Cricket) నుంచి ఇటు టెస్ట్ క్రికెట్ వరకు ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పటికీ డాన్ బ్రాడ్‌మాన్ రికార్డులు కొన్ని చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇంతటి దిగ్గజ బ్యాటర్‌ ఒక విషయంలో మాత్రం విఫలమయ్యాడు. తన కెరీర్‌లే వేలాది పరుగులు చేసిన డాన్ బ్రాడ్‌మాన్.. కేవలం 6 సిక్సులు మాత్రమే కొట్టాడంటే నమ్ముతారా? కానీ ఇదే నిజం. డాన్ బ్రాడ్‌మాన్ తన టెస్టు కెరీర్‌లో కేవలం ఆరే సిక్సర్లు కొట్టాడు. ఇందులో 5 సిక్సర్లు ఇంగ్లాండ్ మీద బాదగా.. ఒక సిక్సర్ ఇండియాపై కొట్టాడు. సర్ డాన్ బ్రాడ్‌మాన్ మొత్తం 52 టెస్టులు ఆడి 12 డబుల్ సెంచరీలు, 20 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అతడి సగటు 99.94గా ఉన్నది. ఇక 234 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 95.14 సగటుతో పరుగులు చేశాడు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం గమనార్హం.

    డాన్ బ్రాడ్‌మాన్ టెస్ట్ కెరీర్‌లో 6996 పరుగులు చేశాడు. ఇందులో 681 ఫోర్లు ఉన్నాయి. అతడు అత్యధికంగా ఒక ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్ క్లాస్‌లో బ్రాడ్ మాన్ మొత్తం 28067 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోర్ 452. క్రికెట్‌లో ఆల్ టైమ్ లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న బ్రాడ్ మాన్.. క్రికెట్ కోసమే పుట్టిన మనిషిగా కీర్తించబడ్డాడు. ఎన్నో ఏళ్ల క్రితమే రాబోయే తరాల కోసం ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఈ కుడి చేతి వాటం ఆస్ట్రేలియా బ్యాటర్ అంటే బౌలర్లకు పీడ కలే అంటే అతిశయోక్తి కాదు.

    AUS vs ENG: గబ్బాలో 5 వికెట్లు తీసిన కెప్టెన్ పాట్ కమిన్స్.. 127 ఏళ్ల రికార్డు సమం చేసిన ఆసీస్ కెప్టెన్



     టెస్టుల్లో ఎన్నో రికార్డులు సాధించిన బ్రాడ్‌మాన్ తన తొలి టెస్టులో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 20 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడిన తర్వాత కూడా అతడి సగటు 99.94గా ఉన్నది. ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేక పోయారు. 1928లో నవంబర్‌న ఇంగ్లాండ్‌పై బ్రాడ్‌మాన్ అరంగేట్రం చేశాడు. అయితే ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఈ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 675 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్‌లో 20 ఏళ్ల పాటు రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన తర్వాత 1948లో బ్రాడ్‌మాన్ రిటైర్డ్ అయ్యాడు.


    Test Cricket: ఒకే సమయంలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్!! ఎప్పుడు? ఎక్కడ? ఈ అరుదైన రికార్డు నమోదయ్యింది!!



    బ్రాడ్‌మాన్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లాండ్ బౌలర్లు అత్యంత క్రూరమైన పద్దతుల్లో బౌలింగ్ చేసేవాళ్లు. 1930 నుంచి 1940 వరకు బ్రాడ్‌మాన్ ఒక వెలుగు వెలిగాడు. ఆ పదేళ్ల కాలంలో బ్రాడ్‌మాన్ ఒక మాస్టర్ బ్లాస్టర్ బ్యాటర్. 1930లో జరిగిన ఒక సిరీస్‌లో 974 పరుగులు చేశాడు. అందులో హెడింగ్లేలో జరిగిన మ్యాచ్‌లో ఓకే రోజులో 309 పరుగులు చేశాడు. ఆ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏడు మ్యాచ్‌లలో కూడా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇంగ్లాండ్‌ను బ్రాడ్ మాన్ తన బ్యాటింగ్‌తో తుత్తునీయులు చేస్తుంటే.. ఇంగ్లాండ్ ఒక క్రూరమైన బౌలింగ్‌ను అభివృద్ది చేసింది. దీన్ని కేవలం బ్రాడ్‌మాన్‌పై ప్రయోగించడానికి మాత్రమే ఉపయోగించే వాళ్లు. అతడిని విఫలం చేయడానికి చాలా భయంకరమైన బంతులను విసిరే వాళ్లు, ఆ సమయంలో కూడా బ్రాడ్‌మాన్ సగటు 56 కంటే ఎక్కువగానే ఉండేది.




    ఇంగ్లాండ్ బౌలర్ల భీకరమైన బంతులను ఎదుర్కోవడానికి బ్రాడ్‌మాన్ తనకు తానే ఒక పద్దతిని ఫాలో అయ్యాడు. గోల్ఫ్ బంతి, క్రికెట్ స్టంప్, వాటర్ ట్యాంకును ఉపయోగించి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. వాటర్ ట్యాంకుకు బంతిని బలంగా విసిరి ఆ తర్వాత ఇక గోల్ఫ్ బంతిని స్టంప్‌తో కొడుతూ ఉండేవాడు. బంతి కిందపడకుండా ట్యాంకుకు కొడుతూనే ఉంటూ.. కంటికి, బ్యాటుకు మధ్య సమన్వయాన్ని ప్రాక్టీస్ చేసేవాడు. ఇలా బ్యాలెన్స్ చేయడం నేర్చుకొని ఎలాంటి బౌలర్‌ను అయినా సమర్ధవంతంగా బాదడం మొదలు పెట్టాడు.

    Anna Kournikova: ఈ టెన్నిస్ తార వయసు 40 ఏళ్లంటే నమ్మగలమా? సెక్సీ ఔట్‌ఫిట్‌లో అన్నా కౌర్నికోవా


    సర్ డాన్ బ్రాడ్‌మాన్ ఇప్పటి వరకు చేసిన 12 డబుల్ సెంచరీల రికార్డు బద్దలు కాలేదు. శ్రీలంక బ్యాటర్ కుమార సంగక్కర టెస్టుల్లో 11 డబుల్ సెంచరీలు చేశాడు. కానీ బ్రాడ్‌మాన్ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేక పోయాడు. బ్రాడ్‌మాన్ తన చివరి టెస్టులను 14 అగస్టు 1948న ఆడాడు. ఆ మ్యాచ్‌లో 0 వద్ద బ్రాడ్‌మాన్ అవుటయ్యాడు. దాంతో అతడి సగటు 99.94కు పడిపోయింది. లేకపోతే అతడి సగటు 100గా ఉండేది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. డాన్ బ్రాడ్‌మాన్ చివరి టెస్టును ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 149 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Legend, Test Cricket

    తదుపరి వార్తలు