అసాధారణ ప్రతిభతో పతకం సాధించి, మణిపూర్ కీర్తి ప్రపంచానికి చాటినందుకు ఆమెపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. మీరాబాయి చానుకు రూ.కోటి నజరానాతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు ప్రకటించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మీరాబాయి చానుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పావంటూ దేశ ప్రధాని, రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, సీఎంలు, క్రీడాకారులు, సినీ నటులు, సాధారణ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ డోమినోస్ సంస్థ మీరాబాయి చానుకు అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. ఆమెకు జీవితమంతా ఉచితంగా పిజ్జా ఇస్తామని వెల్లడించింది. టోక్యోలో రతజ పతకం గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన మీరాబాయి చాను.. ఒలింపిక్స్ తర్వాత తాను చేయబోయే మొదటి పని పిజ్జా తినడమేనని చెప్పారు. పిజ్జా అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పారు. ఆమె మాట్లాడిన కాసేపటికే డోమినోస్ సంస్థ ఫ్రీ పిజ్జా ఆఫర్‌ను ప్రకటించింది.
''భారత్‌కు ఒలింపిక్ పతకాన్ని అందించిన మీరాబాయి చానుకి శుభాకాంక్షలు. వంద కోట్ల మందికి పైగా భారతీయుల కలలను మీరు నిజం చేశారు. ఇక మీకు జీవితకాలమంతా ఉచితంగా పిజ్జా అందజేస్తాం. ఇంతకుమించిన సంతోషకరమైన విషయం మాకు ఇంకొకటి ఉండదు.’' అంటూ డోమినోస్ ట్వీట్ చేసింది.
ఐతే డొమినోస్ ఆఫర్‌పై నెటిజెన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరాబాయి చాను ఒక అథ్లెట్‌గా అప్పుడప్పుడు మాత్రమే పిజ్జా తింటారని.. దానికి జీవితం కాలం పాటు ఫ్రీ అని పబ్లిసిటీ చేసుకోవడమేంటో..? అని కొందరు విమర్శిస్తున్నారు. దానికి బదులు మీరాభాయి పేరిట అనాథలు, పేద ప్రజల కడుపు నింపవచ్చుగా అని సలహా ఇస్తున్నారు. మరికొందరు మాత్రం డోమినోస్ను వెనకేసుకొస్తున్నారు.
అటు మీరాబాయి చానుకు మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అసాధారణ ప్రతిభతో పతకం సాధించి, మణిపూర్ కీర్తి ప్రపంచానికి చాటినందుకు ఆమెపై ప్రశంసలు కురిపించారు. మీరాబాయి చానుకు రూ.కోటి నజరానాతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు ప్రకటించారు. మీరాబాయి చాను ప్రస్తుతం రైల్వే టీసీగా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగానికి బదులుగా మరో కొత్త ఉద్యోగాన్ని ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, 26 ఏళ్ల మీరాబాయి చానుకు గతంలోనూ పలు గౌరవాలు దక్కాయి. కేంద్రం నుంచి పద్మశ్రీతో ఆటు రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.