జొకోవిచ్ సంచలనం... నాదల్‌ను ఓడించి, ఏడోసారి ఆస్ట్రేలియాన్ ఓపెన్ కైవసం...

Australia Open 2019 Final: ఫైనల్ చేరిన ప్రతీసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెర్బియా స్టార్... మూడు సెట్లలో చిత్తుగా ఓడిన రఫెల్ నాదల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 27, 2019, 5:09 PM IST
జొకోవిచ్ సంచలనం... నాదల్‌ను ఓడించి, ఏడోసారి ఆస్ట్రేలియాన్ ఓపెన్ కైవసం...
విజయానందంలో నొవాక్ జొకోవిచ్
  • Share this:
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019లో సెర్బియన్ స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర క్రియేట్ చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌పై పూర్తి ఆధిపత్యం కనబర్చిన జొకోవిచ్... కెరీర్‌లో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచి... సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో నోవాక్ జొకోవిచ్ 6-3, 6-2, 6-3 తేడాతో వరుసగా మూడు సెట్లు గెలిచి... రఫెల్ నాదల్‌పై ఘనవిజయం సాధించాడు. ఏడుసార్లు టైటిల్ గెలిచి, ఆస్ట్రేలియన్ ఓపెన్ అత్యధిక సార్లు గెలిచన క్రీడాకారుడిగా రికార్డు క్రియేట్ చేశాడు జొకో. ఇప్పటిదాకా టెన్నిస్ లెజెండరీ ప్లేయర్స్ రాయ్ ఎమర్సన్, ఫెదరర్ ఆరేసి సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకుని, అత్యధిక సార్లు ఈ టోర్నీ గెలిచిన ప్లేయర్స్‌గా ఉన్నారు.

ఇప్పుడు ఆ రికార్డు నొవాక్ జొకోవిచ్ సొంతమైంది. ఇప్పటికే ఆరుసార్లు ఫైనల్ చేరిన నొవాక్ ప్రతీసారీ ఛాంపియన్‌గా నిలిచాడు. 2008, 2011, 2012, 2013, 2015, 2016 ఏడాది టైటిల్స్ గెలిచిన నొవాక్... 2019లో హిస్టరీ రిపీట్ చేసి... సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. వరుసగా మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన నొవాక్ జొకోవిచ్... తన మేజర్ టోర్నీల సంఖ్యను 15కి పెంచుకున్నాడు.

Australia Open 2019, Novak Djokovic, Rafel nadal, Aus open Final, Djoker, Australia Open final 2019, Novak Djokovic vs Rafel Nadal, ఆస్ట్రేలియా ఓపెన్ 2019 ఫైనల్, రఫెల్ నాదల్, నోవాక్ జొకోవిచ్, నాదల్ vs జొకోవిచ్
రఫెల్ నాదల్‌తో జొకోవిచ్

రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్, రఫెల్ నాదల్ 17 టైటిల్స్ మాత్రమే జొకోవిచ్ కంటే ముందున్నారు. టైటిల్ గెలిచన జొకోవిచ్‌కు 4.1 మిలియన్ డాలర్లు (రూ. 29 కోట్లకు పైగా) ప్రైజ్‌మనీ రూపంలో దక్కగా...రన్నరప్‌గా నిలిచిన రఫెల్ నాదల్‌కు 2.05 మిలియన్ డాలర్లు (రూ.14.5 కోట్లకు పైగా) అకౌంట్‌లో చేరనుంది.

నొవాక్ జొకోవిచ్ విన్నింగ్ మూమెంట్స్...

నొవాక్ జొకోవిచ్ చరిత్ర క్రియేట్ చేసిన బ్యాటును స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించిన అభిమానికి ఇచ్చాడు నొవాక్ జొకోవిచ్...


First published: January 27, 2019, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading